BSNL నుండి అన్ని కాల్స్ ఫ్రీ అండ్ 2 రూ లకు ఇంటర్నెట్ ఆఫర్స్ వస్తున్నాయి

Updated on 28-Nov-2016

BSNL జనవరి 2017 నుండి ఫ్రీ కాల్స్ ప్రవేశ పెడతున్నట్లు తెలిపింది. అయితే ఇది కేవలం 4G ఫోనులకే కాదు, 2G మరియు 3G ఫోనులకు కూడా పనిచేయనుంది.

ఈ విషయం స్వయంగా BSNL చైర్మన్ అండ్ MD అనుపమ్ తెలిపారు. అంతేకాదు రిలయన్స్ Jio కన్నా తక్కువ ప్లాన్స్ కు ఇంటర్నెట్ అందించే దిశలో పనిచేస్తున్నాము అన్నారు.

అంటే 2 లేదా 4 రూ లకు ఇంటర్నెట్ ప్లాన్స్ ను ప్రవేశ పెడతాము అన్నారు అనుపమ్. Jio ప్లాన్స్ ను ముకేష్ అంబానీ అనౌన్స్ చేసిన తరువాత మార్పులు చేసి కొత్త ప్లాన్స్ ను ప్రవేశ పెట్టిన మొదటి నెట్ వర్క్ BSNL.

అయితే ఇది డైరెక్ట్ మొబైల్ subscribers కు కాకుండా ఇంట్లో బ్రాడ్ బాండ్ కనెక్షన్ ఉన్నవారికి ఉంటుంది అని తెలుస్తుంది. ఎందుకంటే ఫ్రీ కాల్స్ అనేది బ్రాడ్ బ్యాండ్ నుండి కనెక్ట్ అవనున్నట్లు అంచనా.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :