సింగిల్ గా ఆటోలు ఎక్కుతున్నారా? అయితే మీ స్మార్ట్ ఫోనులు పోయే అవకాశాలున్నాయి..

Updated on 08-Nov-2016

ఇది టెక్నాలజీ కు సంబందించిన పోస్ట్ కాదు. కాని పలువురుకు ఉపయోగపడుతుంది అనిపిస్తే, రైటింగ్ లో ఉన్న rules, గీతలు చెరపటానికే ప్రాముఖ్యం ఇస్తాను.

సో రీసెంట్ గా నాకు ఒక డిజిట్ తెలుగు రీడర్ తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పటం జరిగింది. అది చదివినప్పుడు, ఈ విషయం అందరికీ తెలియజేయాలని అనుకున్నాను.

అతను పంపిన మెసేజ్ పైన ఇమేజ్ లో చదవగలరు. ఇలాంటి వాటిని డిజిట్ తెలుగు ఫాలోవర్స్ మరియు ఇది చదివే ఎవరైనా ఎదుర్కోవచ్చు. సో మీరు కూడా అతని వలె ఇబ్బంది పడకూడదు.

అసలు ఏమి జరిగింది?

హైదరాబాదు లో అందరూ ఎక్కే స్పాట్స్ లో కాకుండా రోడ్ మధ్యలో ఆటో కోసం ఎదురుచూస్తున్న వారిని ఎక్కించుకొని, జేబులో ఉండే స్మార్ట్ ఫోన్ లను దొంగలించే ఆటో batch లు ఇప్పుడు బాగా తిరుగుతున్నాయి నగరంలో. ఇలాంటివి చదవటానికి ఇంటరెస్టింగా ఉంటాయని కాకుండా నిజంగా సమాచారం గా భావించి, చదవి, హైదరాబాదులోనే కాదు మీ ఏరియా లో కూడా మీరు అప్రమత్తంగా ఉండటానికి ప్రయత్నం చేస్తే ఫోన్ పోగొట్టుకోరు.

ఏలా చేస్తారు?

మీరు రోడ్ మీద ఒక్కరే వెయిట్ చేస్తుంటే ఆటో వస్తుంది. అందులో ఆల్రెడీ బాగా ఫిల్ అయిన ప్రయాణికులు ఉంటారు. మీరు అంత comfortable గా లేకున్నా, అవసరం కాబట్టి ఎక్కుతారు. ఎక్కిన తరువాత ముందుకు వెళితే మరో వ్యక్తి ఎక్కుతారు. అప్పుడు మిమ్మల్ని ముందున డ్రైవర్ వద్దకు వెళ్ళమని… "మేము దిగాలి, మీరు ఒకసారి దిగగలరా"  లేదా "ఒకసారి దిగండి పోలిస్ ఉన్నారు" అనే మాటలు చెబుతారు ఆటో లోని వారు..

దిగిన వెంటనే మీకు ఏమి జరుగుతుందో అర్థమయ్యేలోపు ఆటో ఫాస్ట్ గా వెళిపోతుంది. ఏమైందో అర్థమకాక 'సరిలే డబ్బులు ఇవ్వలేదు కదా' అని మీరు ముందుకు అడుగులు వేస్తూ జేబులో చేయపెట్టగానే తెలుసుకుంటారు ఆటో లో ఉన్న వారు మీ స్మార్ట్ ఫోన్ దొంగలించారు అని. అవును వాళ్ళు తోటి ప్రయాణికులు కాదు. డ్రైవర్ తో సహా అందరూ ఇలాంటి పనులు చేస్తూ నగరం లో బాగా హాల్ చల్ చేస్తున్నారు.

ఇదే సంఘటన one year క్రితం నా మిత్రుడు ఒకరికి జరిగింది. నాకు మెసేజ్ పెట్టిన డిజిట్ తెలుగు రీడర్ Gowtham Appala కు నిన్న మొన్నన జరిగింది.  అంటే వాళ్ళు ఎంత కాలం నుండి చేస్తున్నారు? వాళ్ళ పని ఎంత సునాయాసంగా సక్సెస్ ఫుల్ గా జరుగుతుందో ఆలోచించండి.

డిజిట్ తెలుగు రీడర్స్ లేదా ఇది చదివే వారందూ ఇలాంటివి ఎదురైతే….. ఎక్కే ముందే జరగబోయ్యే దాన్ని అంచనా వేయగలిగితే, భయపడకుండా ఆటో ఎక్కే ముందే లేదా ఎక్కిన వెంటనే ఆటో నంబర్ ను మెమరీ లో నోట్ చేసుకుని. వెంటనే దిగిపోయి, తరువాత పోలీసులకు ఆటో నంబర్ తో పాటు జరిగిన సందర్భాన్ని inform చేయండి. కచ్చితంగా పోలీసులు వీళ్ళను పట్టుకునే అవకాశాలుంటాయి. కాని ఫోన్ ను చాలా జాగ్రత్తగా బద్రపరచటం అతి ముఖమైన అంశం.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :