Social Media ప్రస్తుతం ఎంత పవర్ ఫుల్ గా మారింది అనేది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా పై పూర్తిగా అవగాహన లేకుండా సోషల్ మీడియాలో కనిపించే ప్రతీ విషయం నిజమే అనుకునే స్థాయికి ఇప్పుడు ఇది పెరిగి పోయింది. అయితే, 16 సంవత్సరాల లోపు పిల్లలు దీని ప్రభావానికి లోనవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక నివేదిక ఇందుకు అద్దం పడుతుంది. అదేమిటంటే, 16 సంవత్సరాల లోపు పిల్లలకు షోషల్ Social Media బ్యాన్ చేసే దిశగా ఆస్ట్రేలియా అడుగులు వేస్తున్నట్లు Reuters వెల్లడించింది.
16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా కోసం యాక్సెస్ ని నిషేధించాలని, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని ఆల్బనీస్ పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్ వలన పిల్లలు శారీరక శ్రమకు దూరమవడమే కాకుండా అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే, సోషల్ మీడియా లో వచ్చే కంటెంట్ లేదా ఇతర విషయాలు కూడా పిల్లల పై ఎక్కువగా ప్రభావం చూపుతోందని గుర్తు చేశారు.
ఇదే విధంగా కొనసాగితే, రానున్న కొన్ని రోజుల్లో మరింత తీవ్రమైన దుష్పరిణామాలను చూడవలసి వస్తుందని ఆయన తెలిపారు. అందుకే, 16 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా ని దూరం చేయాలని, దానికోసం వారికి సోషల్ మీడియా పై యాక్సెస్ ను నిషేదించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇప్పటికే సోషల్ మీడియా పరిధి గురించి అనేక సార్లు ప్రస్తావించిన ఆంథోని ఆల్బనీస్, పిల్లలకు సోషల్ మీడియా ను దూరం చేయడం వారి తల్లిదండ్రులకు చేసే మేలుగా కూడా వర్ణించారు. ఆయన చెప్పిన మాటలో నిజం ఉందని కూడా చాలా మంది నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి, కేవలం ఆస్ట్రేలియా ప్రధాని మాత్రమే కాదు నార్వే ప్రధాని కూడా ఇటీవల సోషల్ మీడియా ఏజ్ లిమిట్ గురించి ప్రస్తావించారు. 15 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Also Read: Noise Buds: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో కొత్త బడ్స్ లాంచ్ చేస్తున్న నోయిస్.!
ఈ విధంగా చర్యలు తీసుకుంటే TikTok, Youtube, Instagram, Facebook మరియు X ప్లాట్ ఫామ్స్ పై పిల్లలకు యాక్సెస్ నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇది పూర్తి కార్య రూపం దాల్చడానికి ఎన్ని రోజులు పడుతోందో చూడాలి.