ఈరోజు పసిడి ప్రియులకు ఊరట.. ఎంత తగ్గిందంటే.!!

ఈరోజు పసిడి ప్రియులకు ఊరట.. ఎంత తగ్గిందంటే.!!
HIGHLIGHTS

జూలై నెల ఓడిదిడుకుల్లో సాగిన పసిడి యాత్ర

జూలై చివరికల్లా కొంచెం ట్రాక్ లో పడింది

ఈరోజు మార్కెట్ మొదలవుతూనే మళ్ళీ తగ్గిన బంగారం ధర

జూలై నెల ఓడిదిడుకుల్లో సాగిన పసిడి యాత్ర జూలై చివరికల్లా కొంచెం ట్రాక్ లో పడింది. జూలై నెల చివరి వరకు కూడా బంగారం ధర భారీ పతనాన్ని చూసింది. అంతేకాదు, జూలై నెలలో 7 నెలల కనిష్ఠాన్ని కూడా చవిచూసింది. అయితే, జూలై నెల చివరికల్లా బంగారం ధర తిరిగి పుంజుకుంది. చివరి 4 రోజుల్లో తులానికి దాదాపుగా 800 పైగా పెరుగుదలను నమోదు చేసింది. అయితే, ఈరోజు మార్కెట్ మొదలవుతూనే మళ్ళీ తగ్గుదలను నమోదు చేసింది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో చూద్దామా. 

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,200 రూపాయలుగా ఉండగా, ఈరోజు 100 రూపాయలు తగ్గి 47,600 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 110 రూపాయలు పెరిగి రూ.51,380 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380 గా ఉంది.

Gold Rates 650 11.jpg

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,380 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo