TRAI నిబంధనల ప్రకారం, క్రొత్త ప్యాకేజీలను సిద్ధంచేస్తున్న DTH ప్రొవైడర్లు

Updated on 02-Jan-2019
HIGHLIGHTS

ప్రతి ఒక్క ఛానెల్ ధరను విడివిడిగా ప్రకటించిన వాటిలో మొదటిగా నిలచిన డిష్ టివి మరియు ఎయిర్టెల్ డిజిటల్ టీవీ.

జనవరి 1 వ తేదీ నుండి, టెలికాం రెగ్యులేటర్ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI), చందాదారుల కోసం పే చానెల్స్ కోసం గరిష్ట రిటైల్ ధరల జాబితాను వెల్లడించింది. కొత్త టారిఫుల ద్వారా  చందాదారులు తమకు నచ్చిన ఛానళ్లకు మాత్రమే డబ్బు చెల్లించాలని కోరుకుంటున్నారు, మరియు వారు ఛానెల్ యొక్క ప్రసారకర్తలు (బ్రాడ్కాస్టర్స్)  నిర్ణయించిన MRP ను చూడాలనుకుంటున్నారు.

అయితే, ఈ దశలో ముందంజలో నిలిచాయి ఎయిర్టెల్ డిజిటల్ టీవీ మరియు డిష్ టీవీ. ఎందుకంటే,  ప్రతి ఒక్క ఛానెల్ ధరను విడివిడిగా ప్రకటించిన వాటిలో మొదటిగా నిలచాయి డిష్ టివి మరియు ఎయిర్టెల్ డిజిటల్ టీవీ. అంతేకాకుండా, వాటి యొక్క కొత్త ప్యాకేజీలను కూడా ఇప్పుడు సిద్ధంచేశాయి. ప్రస్తుతం, దాదాపుగా DTH ప్రొవైడర్లు అందరూ కూడా ప్రతిఒక్క ఛానెల్ యొక్క ధరలను విడివిడిగా చూపిస్తున్నాయి, వారి యొక్క ఛానెళ్ల ప్రసారాలపైన.

ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, తెలుగు వారికోసం సరికొత్త ప్యాక్ లను తీసుకొచ్చింది. సౌత్ మాక్స్ తెలుగు , సౌత్ మై స్పోర్ట్స్, సౌత్ మై ఫ్యామిలీ మరియు సౌత్ న్యూ మెగా వంటివాటిని తెలుగువారికోసం అందచేయనున్నట్లు చూపిస్తోంది . వీటి ధరలను ప్రకటించినప్పటికీ ఈ ప్యాకేజిలలో ఎటువంటి ప్రయోజనాలను ఇవ్వనున్నాడనే విషయాన్నీ మాత్రం తెలియచేయలేదు.

ఇక డిష్ టీవీ విషయానికి వస్తే, మొదటగా ఛానళ్ల యొక్క ధరలను ముందుగా ప్రకటించింది మరియు ఇపుడు కొన్ని ప్యాకేజీలను కూడా అందచేస్తోంది. సోనీ నుండి 27 ప్యాకేజీలను, సన్ టీవీ మరియు స్టార్ ఇండియా నుండి  58 ప్యాకేజీలతో పాటుగా ఇలాంటి మరికొన్ని ప్యాకేజీలను ప్రకించింది. అయితే, ఇప్పటివరకు కూడా వ్యక్తిగత చానల్ యొక్క రేట్లను మాత్రమే పక్కాగా చూపిస్తున్నాయి .

అలాగే, Hathway కేబుల్ ఆపరేటర్ కూడా కొన్ని రకాల ప్యాకేజీలను ప్రకటించింది. అందులో భాగంగా, రూ. 275 ధరతో  'మన తెలుగు' ని ప్రకటించింది. అంతేకాకుండా, సిటీ కేబుల్  కూడా వియోగదారులు వారికీ నచ్చిన చానెళ్లను ఎంచుకునేలా కొన్ని కొత్త ప్యాకేజీలను ప్రకటించింది మరియు ఇవి 52 రూపాయల నుండి 166 రూపాయల వరకు ఈ ప్యాకేజి ధరలను చూపిస్తోంది.

అయితే, ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైన విధివిధానాలతో, తమ ప్యాకేజీలను ఎటువంటి సర్వీస్ ప్రొవైడర్ కూడా అంధించలేదు. కొత్త నిభంధనలకు అనుగుణంగా, ప్రతిఒక్క ఛానెల్ ఎంచుకోవడనికి వినియోగదారులకి కొంత సమయంపడుతుంది. ఈ DTH ప్రొవైడర్లు మరియు కేబుల్ ఆపరేటర్లు కూడా వారు అందించనున్న క్రొత్త ప్యాకేజీల విషయంలో స్పష్టతని తీసుకువస్తే, వినియోగదారులకి వారికి నచ్చిన ఛానల్ మరియు ప్యాకేజీలను ఎంచుకోవడానికి సులభంగా ఉంటుంది.      

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :