CHIP డెబిట్/క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఫోన్ వస్తోందా? తస్మాత్ జాగ్రత్త!

CHIP డెబిట్/క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఫోన్ వస్తోందా? తస్మాత్ జాగ్రత్త!
HIGHLIGHTS

ఇది అపాయలకు గురికాకుండా, మరింత భద్రత కలిగించే ఏకైక అయస్కాంత స్ట్రైక్-మాత్రమే కార్డు. ప్రతి క్రెడిట్ / డెబిట్ కార్డును డిసెంబర్ 31, 2018 న EMV చిప్ ఆధారిత కార్డులతో భర్తీ చేయాలి.

 ఈ CHIP లేదా EMV డెబిట్ / క్రెడిట్ అప్డేట్ చేసుకోవడం ప్రతి వినియోగదారునికి కూడా చాల మంచిది, ఎందుకంటే ఇది సెక్యూరిటీ పరంగా ఉత్తమంగా ఉంటుంది మరియు మీ యొక్క డెబిట్/క్రెడిట్ కార్డును సురక్షితంగా ఉండేలా చూస్తుంది.                   

అసలు ఎందుకు ఈ చిప్/EMV కార్డు అప్డేట్ చేసుకోవాలి ? 

RBI చెల్లింపు మరియు సెటిల్మెంట్ సిస్టమ్స్ 2007 యొక్క సెక్షన్ 18 (2) ప్రకారం ఆర్టికల్ 18, 2015 లోని నిబంధనల ప్రకారం, అన్ని డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు 'Chip' పైన  ఆధారపడి ఉండాలని RBI పేర్కొంది. దీనిని EMV డెబిట్ / క్రెడిట్ కార్డు అని పిలుస్తారు. ప్రస్తుతం వాడుతున్న డెబిట్ మరియు క్రెడిట్ కార్డు హోల్డర్లకు ఈ విషయాన్నీ ఎస్ఎమ్ఎస్ ద్వారా జారీ చేస్తున్నారు. ఇది అపాయలకు గురికాకుండా, మరింత భద్రత కలిగించే ఏకైక అయస్కాంత స్ట్రైక్-మాత్రమే కార్డు. ప్రతి క్రెడిట్ / డెబిట్ కార్డును డిసెంబర్ 31, 2018 న EMV చిప్ ఆధారిత కార్డులతో భర్తీ చేయాలి.

సైబర్ నేరగాళ్లు మోసం ఎలాగ చేస్తారు ?

ఆన్లైన్లో మన అకౌంట్ ఓపెన్ చేయాలన్నలేదా నుండి ఎవరికైనా డబ్బును పంపించాలన్నా కూడా మన బ్యాంక్ యొక్క లాగిన్ ఐడి మరోయు పాస్వర్డ్ కచ్చితంగా అవసరం, కాబట్టి ఇవిలేకుండా అకౌంట్ ఓపెన్ చేయడం కష్టతరం. కానీ, డెబిట్ కార్డు ద్వారా డబ్బును ట్రాన్స్ఫర్ చేయాలన్నా, కార్డు క్లోనింగ్ చేయాలన్నా కూడా కార్డు యొక్క  పూర్తి వివరాలను కలిగిఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు అనుసరిస్తున్న చిప్ కార్డు నియమాలను ఆసరాగాచేసికొని, సైబర్ నేరగాళ్లు కొంతమంది అకౌంట్ హోల్డర్లకు ఫోన్ చేసి మీకు CHIP కలిగిన కొత్త కార్డును ఇవ్వనున్నామని, అందుకు మీ పాత కార్డు మరియు మీ వివరాలు కావాలని, వారిద్వారా వివరాలను తెలుసుకొని వారి అకౌంట్ నుండి డబ్బును తీసుకుంటున్నారు.

ఇలా జరగకుండా ఏమి చేయాలి ?

1. వాస్తవానికి, బ్యాంకులు ఎప్పుడు కూడా మీ వివరాలను ఫోను ద్వారా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించవు. ఎందుకంటే, మీకు సంబంధించిన పూర్తి  వివరాలు బ్యాంకుల దగ్గర ఉంటాయి.  మీకు ఇలాంటి ఫోన్లు వచ్చినపుడు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు.

2. ఒకవేళా మీకు ఎక్కువగా ఒత్తిడి తెచ్చినట్లయితే, మేము మా దగ్గరలోని బ్రాంచిని సంప్రదిస్తామని ఒక్క మాటలో తేల్చి చెప్పండి.

3. OTP- వన్ టైం పాస్వర్డ్, ఎటువంటి బ్యాంకు కూడా మీ అకౌంటుకు వచ్చేటటువంటి ఈ OTP గురించి ఎప్పుడు కూడా సమాచారాన్ని సేకరించదు. మిమ్మల్ని మీ యొక్క OTP గురించి అడుగుతున్నారంటే, కచ్చితంగా మిమల్ని మోసగిస్తున్నారని అర్ధం చేసుకోండి.

4. మీ అకౌంటుకు సంబంధించిన వివరాలను, మీరు స్వయంగా బ్యాంకును సంప్రదించి తెలుసుకోండి తప్ప, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి.                                                

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo