ఆపిల్ కు ఇది మొదటి సారి ఇంత పెద్ద malicious అటాక్
ఆండ్రాయిడ్ కు ప్లే స్టోర్ ఉన్నట్లు, ఆపిల్ కు యాప్ స్టోర్ ఉంది. ఇప్పుడు దీనిలో మొట్టమొదటి సారిగా మేజర్ malicious అటాక్ వచ్చింది.
యాప్ స్టోర్ లోని 300 పైగా యాప్స్ ను ఇది ఎఫెక్ట్ చేస్తుంది. వైరస్ ప్రోగ్రాం పేరు XcodeGhost. చాలా సైబర్ సెక్యురిటీ firms ఈ విషయాన్ని ద్రువికరించాయి.
ఐ ఫోన్ అండ్ ఐ ప్యాడ్ ప్రోగ్రామ్స్ ను బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. యాప్ స్టోర్ లో ఉన్న యాప్స్ లోకి చొరబడింది ప్రోగ్రాం. ఎఫెక్ట్ అయిన యాప్స్ యొక్క డెవలపర్స్ కూడా వాళ్లకు తెలియకుండానే ఈ కోడ్ ను యూస్ చేయటం జరిగింది.
అయితే ఇది ఇంతవరకూ ఎటువంటి డేటా thefts ను చేయలేదు. కాని యాప్ డెవలపర్స్ సిస్టంస్ కనుక infect అయితే యాప్ స్టోర్ సెక్యురిటీ compromise అవుతుంది అని విశ్లేషణ.
ఆపిల్ దీని పై ఎన్ని యాప్స్ ఎఫెక్ట్ అయ్యాయి అని ఇంకా స్పందించలేదు. కాని qihoo360 ప్రకారం, మొత్తం 344 యాప్స్ taineted అయ్యాయి XcodeGhost కోడ్ ద్వారా.
ఆధారం: Reuters