Apple Vision Pro: అత్యంత అధునాత టెక్నాలజీతో యాపిల్ సరికొత్తగా తీసుకు వచ్చిన యాపిల్ విజన్ ప్రో VR హెడ్ సెట్ వైరల్ వీడియోలు షాకింగ్ గా ఉన్నట్లు నెటిజన్లకు కామెంట్స్ చేస్తున్నారు. ట్వీటర్ సాక్షిగా యాపిల్ విజన్ ప్రో ధరించి యూజర్లు చేస్తున్న వీడియోలు బాగా వైరల్ చేస్తున్నారు మరియు యూజర్ల తీరును కూడా ఏకేస్తున్నారు.
యాపిల్ VR హెడ్ సెట్ ధరించి Tesla Cyber Truck నడుపుతున్న డ్రైవర్ వీడియో ఇప్పుడు ట్విట్టర్ (X) లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో డ్రైవర్ కారును నడుపుతూ యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్ సెట్ తో ఎంగేజ్ అయ్యారు. ఇది చాలా ప్రమాదరకమని మరియు ఇటువంటి పనుల వల్ల ఎదుటి వారికి హాని కలగవచ్చని, నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
ఇది మాత్రమే కాదు, యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్ సెట్ తో పలు చోట్ల కనిపిస్తున్న చాలా మంది యూజర్ల వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. వినిట్లో కొన్ని వీడియోలు హాస్యాస్పదంగాను మరికొన్ని వీడియోలు ఆలోచింప ఫ్యూచర్ గురించి ఆలోచింప చేసేలా ఉన్నాయి.
Also Read: Gold Market Update: మళ్ళీ దిగుతున్న బంగారం ధర.!
అయితే, యాపిల్ స్టోర్ లో అందుబాటులోకి తీసుకు వచ్చిన Surgical AR Vision గురించి కొనియాడుతున్నారు. దీనితో తీసిన ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో సర్జికల్ ప్రికాషన్స్ మరియు పేషెంట్ కేరింగ్ కోసం ఇది చాలా బాగా సహాయ పడుతుందని చెబుతున్నారు.