iPhone 14 కొత్త ఫోన్ల లాంచ్ తో పాత ఫోన్ల ధరలు భారీగా తగ్గించిన యాపిల్.!

Updated on 09-Sep-2022
HIGHLIGHTS

కొత్త ఫోన్లను విడుదల చేస్తూనే పాత ఐఫోన్ల ధరలు తగ్గించిన యాపిల్

Apple కొన్ని ఫోన్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది

ఈ ఐఫోన్ల రేటును 20 వేల రూపాయల వరకూ తగ్గించింది

ప్రతీ సంవత్సరం కూడా యాపిల్ తన సిరీస్ ఐఫోన్‌లను విడుదల చేస్తుంది. కొత్త ఫోన్లను విడుదల చేస్తూనే పాత ఐఫోన్ల ధరలను తగ్గించడం మరియు కొన్ని సిరీస్ ఫోన్లను యాపిల్ పూర్తి నిలిపివేస్తుంది. ఇదే సైకిల్ లో, సెప్టెంబర్ 7న యాపిల్ తన iPhone 14 సిరీస్ మరియు iPhone 14 pro నుండి మొత్తం నాలుగు ఫోన్లను లాంచ్ చేసింది. ఈ కొత్త ఐఫోన్ 14 లైనప్‌ను ప్రారంభించిన తర్వాత, కొన్ని పాత ఫోన్ల భారీగా తగ్గించింది మరియు కొన్ని ఫోన్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందుకే, యాపిల్ భారీగా ధర తగ్గుంచిన మరియు పూర్తిగా నిలిపేసిన ఐఫోన్ల గురించి ఈరోజు చుడనున్నాము.

ముందుగా, ఐఫోన్ 14 లైనప్‌ రాకతో ఆగిపోనున్న ఐఫోన్ల గురించి ముందుగా తెలుసుకుందాం. 14 ప్రో మాక్స్‌తో పాటు ఐఫోన్ 14 ప్రో కొత్త ప్రో సిరీస్ ఫోన్లను లాంచ్ చేసిన తరువాత గత సంవత్సరం తీసుకొచ్చిన ప్రో ఫోన్లయిన iPhone 13 Pro మరియు iPhone 13 Pro Max లను తొలగించింది. అంటే, ఈ రెండు ఫోన్లు కూడా ఇంకపై యాపిల్ స్టోర్ నుండి అందుబాటులో ఉండవు. అంతేకాదు, 13 Pro ఫోన్లతో పాటు, Apple లైనప్ నుండి iPhone 11 మరియు iPhone 12 mini లను కూడా తీసివేసింది.

ఇక Apple iPhone 14 ఫోన్ల లాంచ్ తరువాత ధర తగ్గినా ఫోన్ల విషయానికి వస్తే, iPhone 13 ఇప్పుడు 69,900 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 13 మినీ ధర రూ.64,900 నుండి, iPhone SE (2022) ధర రూ.49,900 నుండి మరియు iPhone 12 యొక్క ధర రూ.59,900 నుండి ప్రారంభమవుతుంది. అంటే, లాంచ్ సమయంలో వచ్చిన ధరలతో పోలిస్తే ఐఫోన్ 13 పైన 10,000 వేల రూపాయలు మరియు 12 పైన 20 వేల రూపాయల వరకూ తగ్గింపును చూడవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :