మ్యూజిక్, వీడియోస్ మరియు ఇతర కంటెంట్ ను కంట్రోల్ మరియు ట్రాన్స్ఫరింగ్ చేయటానికి థర్డ్ పార్టీ సర్వీసస్ పై ఆధారపడకుండా ఆపిల్ తన సొంత డేటా నెట్వర్క్ ను ఉపయోగించనుంది అట.
క్లౌడ్ స్టోరేజ్ లో ఉన్న ఆపిల్ సర్వీసస్ డేటా ను ఏక్సిస్ మరియు ట్రాన్స్ఫరింగ్ చేయటుకు సొంతంగా కేబుల్స్, నెట్వర్క్ పైప్స్ ను తయారు చేసుకోనుంది ఆపిల్ అని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే క్లౌడ్ స్టోరేజ్ సర్విసస్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ లకు మంచి పోటీ ఇస్తుంది ఆపిల్.
బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం US లోని ఆపిల్ లార్జ్ డేటా సెంటర్స్ మరియు ప్రముఖ నగరాల్లో ఉన్న ఇంటర్నెట్ హాబ్స్ కు హై స్పీడ్ డేటా కేబుల్స్ తో డేటా లింకింగ్ చేసే ప్రయత్నంలో మరియు థర్డ్ పార్టీ నెట్వర్క్ సర్వీసులకు ఆపిల్ ఇస్తున డబ్బుల ఖర్చును తగ్గించుకునేందుకు ఈ పని చేస్తుంది. యూజర్స్ కూడా హై స్పీడ్ కంటెంట్ ను అందించే ప్రయత్నం ఇది. ఆపిల్ సొంత ఆన్ లైన్ TV సర్వీస్ ను కూడా మొదలుపెట్టనుంది అని రూమర్స్ వస్తున్నాయి.
2014 సంవత్సరంలో ఆపిల్ 1 బిలియన్ల డాలర్స్ ఖర్చు పెట్టి తన సొంత డేటా సెంటర్స్ ను స్తాపించింది. ఫేస్బుక్, గూగల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ఇంటర్నెట్ కంపెనీలు కూడా ఇదే మాదిరిగా డేటా సెంటర్లు పెట్టుకున్నాయి.
వినియోగదారులకు క్వాలిటీ కంటెంట్ ను ఇవ్వాలి అని అనుకునే సంస్థ ఆపిల్ తన డేటా బ్రాడ్ బాండ్ నెట్వర్క్స్ పై యూజర్స్ కు అందుతున్నా పూర్తిగా వినియోగదారులకి సెక్యూర్ సిస్టం డేటా కేబుల్స్ ను అందించాలని సెకెన్ కు కొన్ని వందల గిగా బైట్ ల డేటా ట్రాన్స్ఫర్ అయ్యేలా ఆపిల్ నిర్ణయాలు తీసుకుంటుంది.
ఆధారం: Bloomberg