Apple Mac Mini అల్ట్రా కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ M4 chip తో లాంచ్ అయ్యింది.!
Apple Mac Mini ని ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా యాపిల్ విడుదల చేసింది
యాపిల్ మ్యాక్ మినీ అల్ట్రా కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ M4 chip తో లాంచ్ అయ్యింది
మ్యాక్ మినీ ఒకేసారి మూడు స్క్రీన్ లకు సపోర్ట్ చేస్తుంది
Apple Mac Mini ని ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా యాపిల్ విడుదల చేసింది. యాపిల్ మ్యాక్ మినీ అల్ట్రా కాంపాక్ట్ సైజులో పవర్ ఫుల్ M4 chip తో లాంచ్ అయ్యింది. మ్యాక్ మినీ ఒకేసారి మూడు స్క్రీన్ లకు సపోర్ట్ చేస్తుంది మరియు చాలా వేగంగా ఉంటుంది. యాపిల్ సరికొత్తగా విడుదల చేసిన ఈ కాంపాక్ట్ మ్యాక్ ప్రైస్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.
Apple Mac Mini : ధర
యాపిల్ మ్యాక్ మినీ రూ. 59,900 రూపాయల ప్రారంభ ధరతో వచ్చింది. మ్యాక్ మినీ హై ఎండ్ వేరియంట్ రూ. 1,49,900 ధరతో లాంచ్ అయ్యింది. ఇది ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్ కి అందుబాటులోకి వచ్చింది. అయితే, నవంబర్ 8వ తేదీ నుంచి ఇది సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read: Google Pixel 7a పై ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ ధమాకా ఆఫర్.!
Apple Mac Mini : ఫీచర్స్
ఈ కొత్త మ్యాక్ మినీ యాపిల్ యొక్క లేటెస్ట్ చిప్ సెట్ M4 chip తో లాంచ్ అయ్యింది. ఈ చిప్ 16-core Neural Engine తో వస్తుంది. ఇందులో 10-core CPU మరియు 10-core GPU తో ఉంటుంది. బేసిక్ వేరియంట్ 16GB యూనిఫైడ్ మెమరీ మరియు 256GB SSD తో వస్తుంది. అయితే, హై ఎండ్ వేరియంట్ 64GB వరకు పెంచుకోగలిగిన 24GB యూనిఫైడ్ మెమరీ మరియు 8TB వరకు పెంచుకోగలిగిన 512GB SSD తో వస్తుంది.
యాపిల్ మ్యాక్ మినీ 6K రిజల్యూషన్ సపోర్ట్ తో వస్తుంది. అది కూడా రెండు 6K స్క్రీన్ లను ఒకేసారి ప్లే చేస్తుంది మరియు మూడవ స్క్రీన్ ను 5K రిజల్యూషన్ వద్ద ప్లే చేయగలదు. ఇది కేవలం 1.96 ఇంచ్ ఎత్తు, 5 ఇంచెస్ వెడల్పు మరియు 5 అంగుళాల పొడవు కలిగి చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. ఇది లేటెస్ట్ macOS పై నడుస్తుంది మరియు చాలా వేగవంతమైన గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుంది.