ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణి చేయాలని నిర్ణయించుకుంది. డిజిటల్ ప్లాట్ఫారల పైన అందుబాటులో వుండే ప్రభత్వ ఆన్లైన్ సర్వీసులను వారికీ నేరుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తాయి.
ఈ స్మార్ట్ ఫోన్లను సిమ్ కార్డుతో పాటుగా అందించనుంది. అలాగే, ఈ ఫోనుతో రోజువారీ 50 SMSలు మరియు 1GB డేటాని కూడా అందుకుంటారు.
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి, K. విజయానంద్ గారు, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ ఈ స్మార్ట్ ఫోన్ల సేకరణకు నోడల్ ఏజన్సీగా ఉంటుందని తెలిపారు.