డ్వాక్రా మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణి చేయనున్నAP సర్కార్ : రిపోర్ట్
By
Raja Pullagura |
Updated on 14-Feb-2019
HIGHLIGHTS
ఈ స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభత్వం, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను పంపిణి చేయాలని నిర్ణయించుకుంది. డిజిటల్ ప్లాట్ఫారల పైన అందుబాటులో వుండే ప్రభత్వ ఆన్లైన్ సర్వీసులను వారికీ నేరుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో నడుస్తాయి.
ఈ స్మార్ట్ ఫోన్లను సిమ్ కార్డుతో పాటుగా అందించనుంది. అలాగే, ఈ ఫోనుతో రోజువారీ 50 SMSలు మరియు 1GB డేటాని కూడా అందుకుంటారు.
ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి, K. విజయానంద్ గారు, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ ఈ స్మార్ట్ ఫోన్ల సేకరణకు నోడల్ ఏజన్సీగా ఉంటుందని తెలిపారు.