AP ఫైబర్ గ్రిడ్ ప్లాన్స్ రూ .149 లకి స్టార్ట్ : బ్రాడ్బ్యాండ్, టెలివిజన్ మరియు టెలిఫోన్ సర్వీసెస్ సింగిల్ ప్యాకేజీలో ….

AP ఫైబర్ గ్రిడ్ ప్లాన్స్ రూ .149 లకి స్టార్ట్ :  బ్రాడ్బ్యాండ్, టెలివిజన్ మరియు టెలిఫోన్ సర్వీసెస్   సింగిల్ ప్యాకేజీలో ….

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు AP ఫైబర్ గ్రిడ్ ని  ప్రకటించారు, ఇది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని అధిక-వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ ని  సరసమైన ధరలకు అనుసంధానించే ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్లాన్ . 
నేడు, ప్రాజెక్ట్ సంభందించిన  అన్ని వివరాలు అధికారికంగా ఆవిష్కరించారు. అందువల్ల, AP ఫైబర్ గ్రిడ్ ప్లాన్ లు మూడు సర్వీసెస్ ను అందిస్తాయి-వైర్డ్  బ్రాడ్బ్యాండ్ సర్వీస్ , టెలివిజన్ సేవ, మరియు వాయిస్ కాల్స్ కోసం టెలిఫోన్ సేవ.AP ఫైబర్ గ్రిడ్ ప్లాన్స్ రూ .149 లో  బ్రాడ్బ్యాండ్, టెలివిజన్ మరియు టెలిఫోన్ సేవలను సింగిల్ ప్యాకేజీలో అందిస్తుంది

ప్రకటించిన సమయంలో, AP ప్రభుత్వం వారు 1.3 కోట్ల కుటుంబాలు, 10,000 ప్రభుత్వ కార్యాలయాలు, 50,000 పాఠశాలలు మరియు 2018 నాటికి 5,000 పబ్లిక్ హెల్త్ సెంటర్లు కనెక్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రకటించారు. 13 జిల్లాల్లో 23,800 కిలోల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఆంధ్రప్రదేశ్లో 2,464 సబ్స్టేషన్లు ఉన్నాయి.

AP ఫైబర్ గ్రిడ్ ట్రిపుల్-ప్లే సర్వీసెస్  అందిస్తుంది, మరియు అన్ని సేవలు ఒకే ప్యాక్ తో కూడినవి . ప్రభుత్వం సాధారణ వినియోగదారులకు మూడు AP ఫైబర్ గ్రిడ్ ప్లాన్ ల ను మరియు సంస్థలకు మరియు ప్రైవేటు కార్యాలయాలకు మూడు ప్లాన్ లను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ (APSFL) ను AP ఫైబర్ గ్రిడ్ యొక్క శ్రద్ధ వహించడానికి, AP రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.

గృహాలు మరియు సంస్థలకు నెలవారీ రెంటల్ ప్లాన్స్  మూడు రకాలుగా విభజించబడ్డాయి-బేసిక్ , స్టాండర్డ్ , ప్రీమియం. గృహాలకు ప్లాన్స్ రూ .149 మరియు రూ .599 వరకు . రూ .149 ఫైబర్ గ్రిడ్ బేసిక్ ప్లాన్ 5GB కు 15 Mbps డౌన్ లోడ్ స్పీడ్  అందిస్తుంది; ఫైబర్ గ్రిడ్ స్టాండర్డ్ ప్లాన్ కూడా 15 Mbps డౌన్లోడ్ స్పీడ్  25GB వరకు అందిస్తుంది, మరియు చివరగా, ఫైబర్ గ్రిడ్ ప్రీమియం ప్లాన్ 15 Mbps వద్ద 50GB అధిక స్పీడ్  డేటా ఇస్తుంది. అన్ని మూడు ప్లాన్లు  FUP  తరువాత అపరిమిత డేటా 1 Mbps . స్టాండర్డ్ ప్లాన్ రూ. 399, ప్రీమియం ప్లాన్ రూ 599 ఖర్చవుతుంది. 

తదుపరి,  సంస్థలు మరియు ప్రైవేట్ కార్యాలయాలు కోసం ప్లాన్స్  వున్నాయి . ఈ ప్లాన్స్  100 Mbps డౌన్ లోడ్ స్పీడ్  అందిస్తాయి మరియు 999 రూపాయల వద్ద ప్రారంభమవుతాయి. రూ 999 యొక్క బేసిక్ ప్లాన్  50GB  100 Mbps వేగంతో అందిస్తుంది, స్టాండర్డ్ ప్లాన్ రూ 1,499 లో 100GB  100 Mbps స్పీడ్ తో వస్తుంది .  మరియు ప్రీమియం ప్లాన్ 100 Mbps స్పీడ్ 250GB వరకు 2,499 రూపాయల వద్ద  లభ్యం .

సంస్థల కోసం బేసిక్ ప్లాన్   FUP తరువాత 1 Mbps  స్పీడ్  ని ఇస్తుంది, స్టాండర్డ్  ప్లాన్ 2 Mbps ఇస్తుంది, మరియు ప్రీమియం ప్లాన్ FUP స్పీడ్  తర్వాత 3 Mbps అందిస్తుంది.

గృహాలకు సంబంధించిన ఈ ప్లాన్ లు 250 టెలివిజన్ ఛానళ్లతో ఉచితమైనవిగా ఉంటాయి మరియు అపరిమిత టెలిఫోన్ కాల్స్ కూడా అందిస్తాయి. ప్రస్తుతం అనంతపూర్, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణ, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో AP ఫైబర్ గ్రిడ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

 

 

 

 

         

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo