గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ పి కోసం తుది డెవలపర్ ప్రివ్యూను విడుదల చేసింది మరియు ఈ సంస్థ సంవత్సరం యొక్క ఉత్తమ భాగంగా ఉంచడం కోసం ఈ కొత్త OS ను పరీక్షించింది. ఆండ్రాయిడ్ పి కోసం అధికారిక రోల్-అవుట్ తేదీని గూగుల్ ఇంకా ప్రకటించలేదు, అయితే ఈ సంవత్సర మూడవ త్రైమాసికంలో ఏదొ ఒక సమయంలో విడుదల కావచ్చని కంపెనీ పేర్కొంది. ఇప్పుడు, ప్రముఖ లీకేటర్ ఇవాన్ బ్లాస్ ఆగష్టు 20 నుంచి ఆండ్రాయిడ్ పి యొక్క అధికారిక వెర్షన్, దానికి మద్దతునిచ్చిన పిక్సెల్ మరియు నెక్సస్ పరికరాలపై సంధించే సమయం వచ్చినట్లు పేర్కొంది.
ఆగష్టు 20వ తేదీని ఆండ్రాయిడ్ పి లోగోతో గుర్తిచడానికి వీలుగా బ్లాస్ ఒక క్యాలెండర్ చిత్రాన్ని ట్వీట్ చేసాడు.
ఆండ్రాయిడ్ పి యొక్క విడుదల తేదీ నిజానికి ఆగష్టు 20 అయితే, త్వరలో రానున్న ఆండ్రాయిడ్ OS కోసం గూగుల్ దాని పూర్తి పేరును వెల్లడిస్తుంది. గతంలో వచ్చిన ఒక లీక్ ఆండ్రాయిడ్ పి ని ఆండ్రాయిడ్ పిస్తాచియో లేదా పిస్తాచియో ఐస్క్రీం అని పిలిచారని వెల్లడించింది, కానీ ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఇది కూడా ఎవరో ఒకరు చేసిన పుకార్లలో కేవలం ఇది కూడా ఒకటి.
ఆండ్రాయిడ్ పి లేదా ఆండ్రాయిడ్ 9.0 ఆండ్రాయిడ్ యొక్క ఎక్స్పీరియన్స్ కోసం చాల మార్పులు తెస్తుంది, ఇది గెస్చర్ నావిగేషన్ కోసం మద్దతుతో ప్రారంభమవుతుంది. వినియోగదారులు సెట్టింగులలో ఉన్న గెస్చర్ నుండి కొత్త నావిగేషన్ను యాక్సెస్ చేయగలరు, అందువల్ల ప్రస్తుత మరియు సంప్రదాయ ఆండ్రాయిడ్ నావిగేషన్ల మధ్య నచ్చిన ఎంపిక ఎంచుకోవడానికి వారికి వీలుంటుంది. ఆండ్రాయిడ్ పి కూడా నోచ్ లకు స్థానిక మద్దతును తెస్తుంది మరియు ఒక ఫోన్లో రెండు నోచ్ లను కలిగి ఉన్నట్లు చూపించే విధంగా OS కోసం ఆప్టిమైజ్ చేయబడిందని గూగుల్ ఇటీవలే వివరణాత్మకంగా తెలిపింది. ఆండ్రాయిడ్ పి యాప్ యొక్క ఎక్స్పీరియన్స్ కోసం ఎగువ మరియు దిగువ ఉన్నకట్అవుట్ కలిగిన ఫోన్ల కోసం ఆప్టిమైజ్(అనుకూలతరం) చేయబడింది. కొత్త త్వరిత సెట్టింగుల మెనూ, అనుకూల బ్రైట్నెస్, అంచనాత్మక యాప్ చర్యలు, గూగుల్ శోధనలో యాప్ యొక్క ఒక ముక్కను (స్లైస్) చూపుతుంది మరియు ఫోనులో గడిపే సమయాన్ని తగ్గించడానికి గూగుల్ యొక్క డిజిటల్ శ్రేయస్సు కార్యక్రమానికి సెట్టింగులు కూడా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ పి బీటా ఇప్పుడు కేవలం , నెక్సస్ మరియు పిక్సెల్ డివైజ్ లకు మాత్రమే అందించడింది కాదు ఎసెన్షియల్ ఫోన్, ఒప్పో ఆర్15 ప్రో, నోకియా 7 ప్లస్, సోనీ ఎక్స్పీరియ XZ2, షియోమీ మి మిక్స్ 2ఎస్, వివో ఎక్స్ 21 మరియు వన్ ప్లస్ 6 వంటి వాటికి కూడా వర్తిస్తుంది. ఆండ్రాయిడ్ పి కి అప్డేట్ కానున్న మొదటి ఫోన్స్ సెట్ గా ఇవి ప్రజలోకి అధికారకంగా వెళ్లనుంది అని అంచనా .