పైన టైటిల్ చెప్పినట్టు గానే గూగల్ తన తరువాతి ఆండ్రాయిడ్ ఓస్ ఆండ్రాయిడ్ M కోసం అధిక బ్యాటరీ బ్యాక్ అప్ మరియు ర్యామ్ మేనేజ్మెంట్ పై ఎక్కువుగా దృష్టి సారిస్తుంది. అయితే ఈ ఓస్ గురించి అధికారికంగా మే 28 న జరగబోవు గూగల్ I/O ఈవెంట్ లో వెల్లడించనుంది గూగల్.
లొకేషన్ చెకిన్ లను మరియు స్క్రీన్ ఆగిపోయాక ఫోన్ లో జరిగే ఏక్టివీటి లను తగ్గించి, బ్యాటరీ లైఫ్ పై ఎక్కువ పనిచేస్తుంది. గూగల్ ప్లే సర్విసస్ ఎక్కువ బ్యాటరీ జ్యూస్ ను తీసుకుంటున్న సంగతి తెలిసిందే, దీనిపై కూడా వర్క్ చేయనుంది అని సమాచారం. గత సంవత్సరం లాలిపాప్ వెర్షన్ ను దించినట్టు గానే ఈ సంవత్సరం కూడా గూగల్ లాలిపాప్ తరువాతి వెర్షన్ ఆండ్రాయిడ్ M ను డెవెలపర్ ప్రివ్యూ గా ఈ నెల జరగబోయే కాన్ఫిరెన్స్ లో విడుదల చేయనుంది. ఫైనల్ రిలీజ్ ఆగస్ట్ నెల కి విడుదల అవుతుంది అని ఊహాగానాలు.
గతంలో వినపడ్డ రూమర్స్ ప్రకారం గూగల్ లాలిపాప్ వెర్షన్ లో ప్రవేశ పెడదామని అనుకున్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ నేటివ్ సెక్యురిటీ ఫీచర్ ను ఆండ్రాయిడ్ M లో ప్రవేసపెట్టనుంది. ఇది గూగల్ నేక్సాస్ 6 ఫోన్ పై రావలిసింది, కనీసం తరువాతి నేక్సాస్ మోడల్ పై ఇది విడుదల చేస్తే డెవలపర్స్ ఆప్స్ ను సరికొత్త సెక్యురిటీ ఆప్షన్స్ తో డెవెలప్ చేసేందుకు రెడీ గా ఉన్నారు. ఇదే ఈవెంట్ లో ఫోటోస్ ఆప్ ను విడుదల చేయనుంది అని మనం గతంలో చదివాం.
ఆండ్రాయిడ్ M లో బెటర్ ప్రైవెసీ సెట్టింగులు కూడా రానున్నాయి. ఇవి ఫోన్ లో ఉన్న అప్లికేషన్స్ ఫోన్ డేటా ఏది ఏక్సిస్ చేయవచ్చు, ఏది చేయకూడదు అనే నిర్ణయం యూజర్ కు ఇస్తుంది. ప్రస్తుతం యూజర్ కు ఆప్ ను ఇంస్టాల్ చేసుకునే సమయంలో పెర్మిషన్స్ ను మార్చే సదుపాయం లేదు. అయితే ఇదే ఫీచర్ ఆండ్రాయిడ్ ఆధారిత Cyanogen Mod, MIUI మరియు Amigo వంటి ఓస్ ల పై ఉంది. గూగల్ తన నెక్స్ట్ నేక్సాస్ డివైజ్ Huawei మరియు LG కంపెనిల చే తయారు అవనుంది అని చెప్పడం జరిగింది. గూగల్ కొత్త నేక్సాస్ కూడా ఈ నెల మే 28న జరగబోయే ఈవెంటు లో అనౌన్స్ అవనున్నాయి. అయితే వాటిలో ఒకటి ఫోన్, మరొకటి టాబ్లెట్.
ఆధారం: ఆండ్రాయిడ్ పోలిస్