Android 15: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఫోన్లలో రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ కొత్త అప్డేట్ వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్ ల కోసం గూగుల్ లేటెస్ట్ OS ఆండ్రాయిడ్ 15 ని రిలీజ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఆండ్రాయిడ్ 15 OS యొక్క బీటా వెర్షన్ రిలీజ్ చేసింది. ఈ బీటా వెర్షన్ ను టెస్ట్ చేయదలుచుకున్న యూజర్లు బీటా వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకొని టెస్ట్ చేయవచ్చు.
ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ ప్రస్తుతానికి కేవలం గూగుల్ యొక్క సొంత ఫోన్స్ ఐన Google Pixel ఫోన్ లలో మాత్రమే పని చేస్తుందని గూగుల్ తెలిపింది. ఈ కొత్త బీటా వెర్షన్ ను పొందడానికి ఆండ్రాయిడ్ బెస్ట్ ఫర్ పిక్సెల్ ప్రోగ్రామ్ నుండి మీ పిక్సెల్ డివైజ్ ని ఎన్రోల్ చేసుకోవలసి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ ను ఏ Google Pixel డివైజ్ లలో ఎన్రోల్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా వెల్లడించింది. Pixel 5a, Pixel 6, Pixel 6 Pro, Pixel 6a, Pixel 7, Pixel 7 Pro, Pixel 7a, Pixel Tablet, Pixel Fold, Pixel 8 మరియు Pixel 8 Pro డివైజ్ లలో ఈ కొత్త బీటా వెర్షన్ కోసం ఎన్రోల్ చేసుకోవచ్చు.
ఈ డివైజ్ లలో ఎన్రోల్ చేసుకున్న తరువాత over-the-air (OTA) ను అందుకుంటారు. ఆండ్రాయిడ్ బెస్ట్ ఫర్ పిక్సెల్ ప్రోగ్రామ్ యొక్క రిలీజ్ సైకిల్ ద్వారా ఇది నాలుగు స్టేబుల్ రిలీజ్ లు ఉంటాయి. ఈ అప్డేట్ లను Quarterly Platform Releases (QPRs) ల ద్వారా అందుకుంటారు.
Also Read: WhatsApp New ఫీచర్ తో ఇక వాట్సాప్ లోనే అన్ని పనులు చేసుకోవచ్చు.!
ఆండ్రాయిడ్ 15 నుండి యూజర్లకు అందించిన కొత్త ఫీచర్స్ వివరాలను కూడా గూగుల్ ముందుగానే తెలిపింది. ఈ కొత్త OS ద్వారా ఫోన్ పెర్ఫార్మెన్క్ ను మరింతగా పెరుగుతుందని చెబుతోంది. ఆండ్రాయిడ్ 15 లో new APIs ని పరిచయం చేస్తోంది, దీని ద్వారా Apps పెర్ఫార్మన్స్ మరింత మెరుగవుతుంది.
ఇది యాప్స్ క్వాలిటీ మరియు పెర్ఫార్మన్స్ పైన మరింత దృష్టిపెడుతుంది. అంతేకాదు, ఆండ్రాయిడ్ 15 తో బ్యాటరీ వినియోగం కూడా తగ్గుంతుందని కూడా చెబుతోంది.
ఆండ్రాయిడ్ 15 ముఖ్యంగా Camera and media పైన ఎక్కువ దృష్టిపెడుతుంది. ఆండ్రాయిడ్ 15 ఫోన్ కెమేరాకి కొత్త ఫీచర్స్ ను జత చేస్తుంది. ఈ కొత్త ఫీచర్స్ ద్వారా కెమేరా మరియు మీడియా ఎక్స్ పీరియన్స్ మరింత గొప్పగా ఉంటుందని కూడా గూగుల్ తెలిపింది.
ఆండ్రాయిడ్ 15 తో HDR headroom control ఫీచర్ అందుతుంది. ఇది Google Photos లో HDR మరియి SDR ఫోటోల కోసం వెతుకులాట లేదా కన్ఫ్యూజన్ ను తగ్గిస్తుంది. ఈ ఫీచర్ SDR మరియు HDR మధ్య సమన్వయాన్ని నిర్వహిస్తుంది.
ఆండ్రాయిడ్ 15 తో మరిన్ని ఆండ్రాయిడ్ ఫోన్ లలో మరిన్ని ఉపయోగకరమైన ఫీచర్స్ ను ఆపాదిస్తునట్లు, గూగుల్ సూచిస్తోంది.