ఆస్ట్రాయిడ్ 2016 NF3 ఈ వారంలో 32,400 km /h వేగం తో భూమిని దాటనుంది, “శక్తివంతమైన హానికర ఉల్క (PHA)” గా NASA దీనిని పరిగణించింది

Updated on 29-Aug-2018
HIGHLIGHTS

NASA ద్వారా ఆస్ట్రాయిడ్ PHA గా భావించినప్పటికీ, అంతరిక్ష సంస్థ దీనికి సుమారు 5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని ఇది తాకే అవకాశం లేదని స్పష్టం చేసింది.

70 నుంచి 160 మీటర్ల వ్యాసం కలిగిన ఒక గ్రహశకలం గంటకు 32,400 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఈ వారం భూమి సమీపంనుండి ప్రయాణించనుందని NASA ప్రకటించింది. ఇది ఆస్ట్రాయిడ్ 2016 NF3 గా నామకరణం చేయబడింది మరియు అంతరిక్ష సంస్థచే "శక్తివంతమైన హానికర ఉల్క" (PHA) అని పిలుస్తారు, అయితే, ఈ ఉల్క ఏ ప్రమాదాలను కలిగి ఉండదు మరియు 8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ ఖగోళ వస్తువు అయినా PHA గా వర్గీకరించబడింది. అయితే ఈ ఉల్క 2016 NF3 మన భూగ్రహం నుండి  5 మిలియన్  కిలోమీటర్ల దూరంగా ఉంటుంది.  కానీ, ఈ చివరి నుండి ఆ చివరి వరకు రెండు ఎయిర్బస్ A380 విమానాలు కంటే పెద్దగా లేదా గిజా యొక్క గ్రేట్ పిరమిడ్ అంత వుండే  ఒక ఉల్క మన భూ గ్రహానికి అతి దగ్గరగా ప్రయాణించనుందంటే ఎవరికైన వణుకు పుట్టిస్తుంది.

NASA యొక్క గ్రహ రక్షణ అధికారి లిన్డ్లే జాన్సన్ ఒక ఇమెయిల్ లో Space.com కు ఇలా వివరించారు, "2016 NF23 యొక్క ఈ ప్రయాణం ద్వారా ఆందోళన చెందడానికి ఏమీ లేదు, ఈ వస్తువు ఒక శక్తివంతమైన హానికర ఉల్క (PHA) ను మాత్రమే సూచిస్తుంది ఎందుకంటే కాలక్రమేణా దాని కక్ష్య భూమి యొక్క కక్ష్య కు 8 మిలియన్ కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది కాబట్టే దీనిని అలా వర్ణించారు, కానీ దీనివలన భూమికి ఏవిధమైన ప్రమాధం లేదు"  కాబట్టి, ఈ కార్యక్రమం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదనంగా, తరువాతి వారంలో 1988 SD9 అనే మరొక ఉల్క భూమి మన చంద్రుని దూరం కంటే నాలుగు రెట్లు దూరంతో భూమిని దాటనుంది.

ఇటీవలే, ఓఎస్ఐఆర్ఐఎస్-రెక్స్ గురించి 2016 లో ఆవిష్కరించబడిన వ్యోమనౌక  ఆస్ట్రోయిడ్ బెన్నూ యొక్క చిన్న నమూనాను సేకరించేందుకని మాక వార్త వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యోమనౌక దాని  'ఉల్క చర్యల' దశలో ఉంది, ఈ మిషన్ లోభాగంగా ఇక్కడ ఇది మొదట ఖగోళ వస్తువుల చిత్రాలను సంగ్రహించి, దాని పరిసరాలను సాధ్యమైన ప్రమాదాలను విశ్లేషిస్తుంది. ప్రస్తుతానికి, అంతరిక్ష వాహనం బెన్నూ నుండి 2 మిలియన్ కిలోమీటర్ల (1.2 మిలియన్ మైళ్ళు) దూరంలో ఉంది. ఇది డిసెంబర్ 3 వరకు బెన్నూని చేరుకోవచ్చని భావిస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :