Ambrane PowerHub 300: ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అంబ్రేన్, కరెంట్ కోతలతో సతమవుతున్న వారి కోసం కొత్త పవర్‌హబ్ 300 పవర్ హౌస్ ను లాంఛ్ చేసింది. ఈ కొత్త పవర్ హౌస్ చిన్నసైజు ఫ్రిడ్జ్ కు సైతం 6 గంటలు పవర్ ఇవ్వగలదని కంపెనీ తెలిపింది. అంతేకాదు, ఈ పవర్ హౌస్ తో ఫ్యాన్ తో సహా చాలా ప్రోడక్ట్స్ ను ఎక్కువ సమయం నడిపించవచ్చని కూడా తెలిపింది.
అంబ్రేన్ నిన్న ఇండియన్ మార్కెట్ లో సరికొత్త ప్రోడక్ట్స్ విడుదల చేసింది. అదే, అంబ్రేన్ పవర్‌హబ్ 300 ని ప్రోడక్ట్స్ మరియు ఈ ప్రోడక్ట్స్ తో స్మార్ట్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు, మినీ – ఫ్రిడ్జ్ లు, TV లు, స్పీకర్లు, మినీ ఫ్యాన్ మరియు మరిన్ని వస్తువులను నడిపించవచ్చు. ఈ ప్రొడక్ట్ యొక్క మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ పవర్ హౌస్ 90,000mAh బ్యాటరీతో కేవలం 2.6kgs బరువు మాత్రమే ఉంటుంది.
ఈ పవర్ హబ్ 90,000mAh బిగ్ బ్యాటరీతో 300W output ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ పవర్ హౌస్ ఎమెర్జెనీ సంయమలో పని చేసే LED/SOS టార్చ్ మరియు 8 పవర్ ఫుల్ అవుట్ పుట్ లతో కూడా వస్తుంది. కేవలం ఇండోర్ మాత్రమే కాదు, ఈ ప్రోడక్ట్ ను అవుట్ డోర్ లలో కూడా ఉపయోగించేలా తీసుకు వచ్చునట్లు తెలిపింది.
Also Read: ట్రాన్స్పరెంట్ TWS Earbuds ను విడుదల చేసిన Promate బ్రాండ్.!
ఇక ఈ పావుర హబ్ లో అందించిన అవుట్ పుట్ ల విషయానికి వస్తే, ఇందులో AC, USB-A, round DC, cigarette lighter మరియు Type-C సపోర్ట్ తో అందించింది. అంతేకాదు, ఈ పవర్ హబ్ తో ఒకేసారి 8 డివైజ్ లను ఛార్జ్ చేయవచ్చని కూడా అంబ్రేన్ పేర్కొంది. ఈ పవర్ హబ్ ను 60W ఇన్ పుట్ తో వస్తుంది మరియు ఇది పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 6 గంటల సమయం తీసుకుంటుంది.
ఇక ఈ అంబ్రేన్ పవర్‌హబ్ 300 సేఫ్టీ ఫీచర్స్ గురించి చూస్తే, ఇది ఓవర్ ఛార్జ్ ప్రొటెక్షన్, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ మరియు టెంపరేచర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ పవర్ హౌస్ BIS certification తో వస్తుంది మరియు 800+ lifecycles అందిస్తుందని కంపెనీ తెలిపింది.
అంబ్రేన్ పవర్‌హబ్ 300 పవర్ హౌస్ ని Rs. 21,999/- ధరతో విడుదల చేసింది. ఈ పవర్ హౌస్ ను Flipkart, Amazon మరియు Ambrane అధికారిక వెబ్సైట్ నుండి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.