భారీ డీల్స్ తో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ను అమెజాన్ అనౌన్స్ చేసింది. ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది మరియు అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి 12 గంటల ముందే సేల్ యాక్సెస్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. ఈ సేల్ నుండి అఫర్ చేయనున్న డీల్స్, ఆఫర్స్ మరియు ప్రోడక్ట్స్ గురించి అమెజాన్ టీజింగ్ మొదలు పెట్టింది. అమెజాన్ అప్ అప్ కమింగ్ సేల్ ఎటువంటి అఫర్స్ ను అందించబోతోందో తెలుసుకుందాం.
అమెజాన్ కొత్తగా అనౌన్స్ చేసిన ఈ గ్రేట్ సమ్మర్ సేల్ ను ICICI మరియు Kotak బ్యాంక్ భాగస్వామ్యంతో తీసుకువచ్చింది. అందుకే, ICICI మరియు Kotak బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ పేమెంట్ మరియు EMI అప్షన్ తో ఈ సేల్ నుండి వస్తువులను కొనుగోలు చేసే వారికి 10% డిస్కౌంట్ అఫర్ వర్తిస్తుంది. అంటే, మీరు ICICI మరియు Kotak కార్డ్స్ తో కొనుగోలు చేసే ప్రోడక్ట్స్ పైన 10% తగ్గింపును పొందవచ్చు.
ఈ సేల్ నుండి Welcome అఫర్ ను కూడా జత చేసింది. ఈ అఫర్ ద్వారా మీరు కొనుగోలు చేసే మొదటి ఆర్డర్ పైన 20% వరకూ క్యాష్ బ్యాక్ ను అందుకోవచ్చని అమెజాన్ సేల్ కోసం అందించిన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ సేల్ పేజ్ నుండి అప్ కమింగ్ డీల్స్ ను గురించి చెబుతోంది. అయితే, ఈ ఆఫర్లను ఇంకా వెల్లడించలేదు మరియు ఈ డీల్స్ పైన లాక్ ను కూడా చూపిస్తోంది. ఆఫర్ల కోసం Click Here
అయితే, ఈ సేల్ నుండి ఆఫర్ చెయనున్న కొన్ని డీల్స్ గురించి మాత్రం టీజర్ పేజ్ ద్వారా ఊరిస్తోంది. ఇందులో ముఖ్యంగా Sony Bravia X74L సిరీస్ స్మార్ట్ టీవీలైన (55) & (65) ఇంచ్ టీవీ లను గురించి చెబుతోంది. ఈ స్మార్ట్ టీవీలను డిస్కౌంట్ ధరతో ఈ సేల్ నుండి అఫర్ చేయబోతున్నట్లు ఊరిస్తోంది. ఈ టీవీ అఫర్ ధరను ఇంకా తెలియ చేయలేదు కానీ, రూ. _ _, 990 ప్రారంభ ధరతో అఫర్ చేయనున్నట్లు టీజింగ్ చేస్తోంది.
అలాగే, ఇతర ఆఫర్లను పరిశీలిస్తే, ఈ సేల్ నుండి బ్లాక్ బాస్టర్ డీల్స్, ప్రైస్ క్యాష్ స్టోర్, కిక్ స్టార్ట్ డీల్స్, 8PM డీల్స్ మరియు మరిన్ని ఆఫర్లను ఈ సేల్ నుండి అందించనున్నట్లు టీజింగ్ మొదలు పెట్టింది.