Amazon Prime మెంబర్ షిప్ రేటు పెంచిన అమెజాన్..!
Amazon Prime Membership రేట్ లను పెంచిన అమెజాన్
నెల మరియు క్వార్టర్లీ ప్లాన్ ధరలు భారీగ పెంచిన అమెజాన్
అమెజాన్ ఛార్జ్ చేస్తున్న కొత్త ధరల వివరాలు తెలుసుకోండి
మీరు Amazon Prime Membership నెల వారి లేదా క్వార్టర్లీ ప్లాన్ సబ్ స్కైబర్ అయితే, మీకు ఇక బ్యాడ్ న్యూస్. ఇక నుండి మీరు చేసే నెల వారి మరియు మూడు నెలల ప్లాన్స్ కోసం మీరు ఇప్పుడు మరింత ఎక్కువ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఎందుకంటే, ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ తన Amazon Prime మెంబర్ షిప్ రేట్లను ఒక్కసారిగా పెంచేసింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ కోసం అమెజాన్ ఛార్జ్ చేస్తున్న కొత్త ధరల వివరాలు తెలుసుకోండి.
ఇటీవలే అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ రేట్ లను పెంచిన అమెజాన్, ఇప్పుడు మరొకసారి మెంబర్ షిప్ రేట్ లను భారీగా పెంచేసింది. అయితే, కొత్తగా పెంచిన రేట్లు కేవలం ఒక నెల మరియు మూడు నెలల ప్లాన్ లకు మాత్రమే వర్తింప చేసింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ వార్షిక ప్లాన్ అయినటువంటి రూ.1,499 ప్లాన్ ధరలో మాత్రం ప్రస్తుతం ఎటువంటి మార్పులు చేయ్యలేదు. అయితే, 2021 లో రూ. 999 రూపాయలకు లభించిన ఈ ప్లాన్ ఇప్పడు రూ. 1,499 ధరకు లభిస్తున్న విషయం తెలిసిందే.
ఇక విషయానికి వస్తే, అమెజాన్ ఇప్పుడు ప్రైమ్ మెంబర్ షిప్ నెల వారి ప్లాన్ ను రూ. 299 రూపాయలకు సెట్ చేసింది. ముందుగా అమెజాన్ నెలవారీ ప్లాన్ ను రూ. 179 కు అందించేది. అంటే, ఈ నెలవారీ ప్లాన్ పైన ఒకేసారి ఏకంగా రూ. 120 రూపాయలు పెంచేసింది.
ఇక మూడు నెలల ప్లాన్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ ముందుగా రూ. 459 రేటుతో అందించిన ఈ క్వార్దర్లీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ఇప్పుడు రూ. 599 రూపాయలకు లభిస్తోంది. అంటే, ఈ ప్లాన్ పైన కూడా 140 రూపాయలు పెంచేసింది.
మీరు ఇప్పటికే ఈ ప్లాన్ సబ్ స్క్రైబర్స్ అయితే, మీ తరువాత రీఛార్జ్ పైన మీరు ఈ కొత్త ధరలతో సబ్ స్క్రిప్షన్ ను కొనుగోలు చేయవలసి ఉంటుంది.