digit zero1 awards

గ్రేట్ డీల్స్ తో Amazon Prime Day సేల్ అనౌన్స్ చేసింది.!

గ్రేట్ డీల్స్ తో Amazon Prime Day సేల్ అనౌన్స్ చేసింది.!
HIGHLIGHTS

గ్రేట్ డీల్స్ తో Amazon Prime Day సేల్ అనౌన్స్ చేసింది

అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా అందించే అతి పెద్ద సేల్

ఈ అతి పెద్ద సేల్ ను జూలై 20 మరియు జూలై 21 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపింది

గ్రేట్ డీల్స్ తో Amazon Prime Day సేల్ అనౌన్స్ చేసింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా అందించే ఈ అతి పెద్ద సేల్ ను ఈ జూలై 20 మరియు జూలై 21 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఈ సేల్ నుంచి భారీ డీల్స్, ఆఫర్లు మరియు బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తాయని అమెజాన్ తెలిపింది. ఈ అమెజాన్ అప్ కమింగ్ బిగ్ సేల్ నుండి ఎటువంటి డీల్స్ లభించనున్నాయో ఒక లుక్కేద్దామా.

Amazon Prime Day

పైన తెలిపినట్లుగా ఈ అమెజాన్ ప్రైమ్ డే సేల్ జూలై 20 మరియు జూలై 21 తేదీల్లో ప్రైమ్ మెంబర్స్ కి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఈ సేల్ ను ICICI మరియు SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అందుకే, ఈ రెండు బ్యాంక్ కార్డ్ లతో ఈ సేల్ నుంచి ప్రొడక్ట్స్ ను కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి ఎలాంటి ఆఫర్లు ఆశించవచ్చు?

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి స్మార్ట్ ఫోన్స్ పైన గరిష్టంగా 40% వరకూ డిస్కౌంట్ అందుకోవచ్చని చెబుతోంది. అంతేకాదు, ఎక్స్ చేంజ్ ఆఫర్ తో అదనపు తగ్గింపు మరియు గరిష్టంగా రూ. 10,000 వరకూ కూపన్ తగ్గింపు వంటి ఆఫర్లు కూడా ఉంటాయని తెలిపింది. ముఖ్యంగా ఈ సేల్ నుండి చాలా కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు కూడా చెబుతోంది. ఈ లిస్ట్ లో లావా బ్లేజ్ ఎక్స్, హానర్ 200 సిరీస్ మరియు మరిన్ని ఫోన్ లు ఉన్నాయని తెలిపింది.

Amazon Prime Day sale
Amazon Prime Day sale

ఈ అప్ కమింగ్ సేల్ నుండి ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీస్ పైన ఏకంగా 80% డిస్కౌంట్ అందుకోవచ్చని అమెజాన్ తెలిపింది. అలాగే, స్మార్ట్ టీవీ లు మరియు ప్రొజెక్టర్ల పై కూడా గరిష్టంగా 60% వరకూ డిస్కౌంట్ అందుకోవచ్చని కూడా అమెజాన్ ఆటపట్టిస్తోంది.

Also Read: ఇండియాలో Sony Bravia 7 Mini LED లాంచ్ చేసిన సోనీ.. రేటు ఎంతంటే.!

ఇది మాత్రమే కాదు, ఫ్యాషన్, హోమ్, కిచెన్ డైలీ అవసరమైన సామాన్లు పైన కూడా గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందించనున్నట్లు అమెజాన్ తెలిపింది. అమెజాన్ ఈ సేల్ నుండి చాలా గొప్ప ఆఫర్లను తీసుకువస్తున్నట్లు గొప్పగా చెబుతోంది. ఈ సేల్ కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే నిర్వహిస్తుంది కాబట్టి, ఈ సేల్ లాభాలను అందుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్ సబ్ స్క్రిప్షన్ కలిగి ఉండాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo