చవక ధరలో Prime Plan తెచ్చే పనిలో ఉన్న అమెజాన్.!
చవక ధరలో Prime Plan తెచ్చే పనిలో అమెజాన్
డ్జెట్ ధరలో కూడా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను అందుకునే అవకాశం
Amazon Prime Lite పేరుతో కొత్త ప్లాన్
చవక ధరలో Prime Plan తెచ్చే పనిలో అమెజాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, బడ్జెట్ ధరలో కూడా అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను అందుకునే అవకాశం వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు యోచిస్తోంది. 1,000 రూపాయల కంటే తక్కువ ధరలో ఈ Prime Plan ను తీసుకురావాలని చూస్తున్నట్లు కొత్త నివేదికలు చెబుతున్నాయి. Amazon Prime Lite పేరుతో ఈ కొత్త ప్లాన్ తీసుకువస్తుందని కూడా ఈ నివేదికలు చెబుతున్నాయి. ఈ కొత్త అమెజాన్ ప్రైమ్ ప్లాన్ మరియు ప్రస్తుత ప్లాన్ లకు ఉండనున్న వ్యత్యాసాలు ఏమిటో తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ vs ప్రైమ్ లైట్:
అన్నింటి కన్నా ముందుగా, అమెజాన్ ప్రైమ్ మరియు ప్రైమ్ లైట్ మధ్య వ్యత్యాసం ఏంటి? అనే పవిషయాన్ని పరిశీలించనున్నాము. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వార్షిక ప్లాన్ 1,499 రూపాయలకు లభిస్తుండగా, అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ బడ్జెట్ యూజర్లను ఆకర్షించే విధంగా రూ.999 ధరతో ఉంటుంది.
ఈ రూ.999 అమెజాన్ ప్లాన్ యాడ్స్ తో కూడిన SD ప్రైమ్ వీడియో ఎక్స్ పీరియన్స్ అందించవచ్చు. అయితే, ఈ ప్లాన్ లో కొన్ని ఫీచర్లను కూడా మీరు పొందలేక పోవచ్చు. ఇందులో, ప్రైమ్ మ్యూజిక్ సబ్ స్క్రిప్షన్, ప్రైమ్ గేమింగ్, ఫ్రీ eబుక్స్, మరియు అమెజాన్ నుండి షాపింగ్ చేసే సమయంలో No-Cost EMI ఫీచర్లను ఈ ప్లాన్ లో దాటవేస్తుంది.
అంటే, తక్కువ ధరలో వచ్చే ఈ ప్లాన్ లో మీరు కొన్ని ముఖ్యమైన ఫీచర్లను కోల్పోతారు. అయితే, మిగిలిన అన్ని విషయాల్లో కూడా రెగ్యులర్ అమెజాన్ ప్రైమ్ ప్లాన్ అందించే ప్రయోజాలను అందిస్తుంది. పైన తెలిపిన ఫీచర్లు అంత ముఖ్యమైనవి కావని మీరు భావిస్తే, ఈ చవక ప్లాన్ ను ఎంచుకోవచ్చు.
అమెజాన్ ఈ ప్లాన్ ను ముందుగా టెస్టింగ్ కోసం ఉంచుతుంది మరియు దీని బీటా టెస్టింగ్ అయిన తరువాత ఈ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకు వస్తుంది.