మనం షాపింగ్ చేసే అమెజాన్ వెబ్ సైట్ Kindle పేరుతో e-books ను చదువుకోవటానికి e readers ను తయారు చేస్తుంటుంది. నిన్న లేటెస్ట్ Kindle మోడల్ Oasis ను లాంచ్ చేసింది.
దీని ప్రైస్ – 23,999 రూ. అవును చాలా ఎక్కువ. ఎందుకంటే దీనిలో కేవలం బుక్స్ చదవటం మాత్రమే చేయగలరు. అదనంగా experimental బ్రౌజర్ పేరుతో ఇంటర్నెట్ ను బ్రౌజ్ చేసుకునే ఫీచర్ ఉంటుంది కాని ఇది e-ink డిస్ప్లే అవటం వలన అంత సునాయాసంగా ఉండదు usage.
అమెజాన్ ఫర్స్ట్ టైమ్ 2007 లో ఈ ebook రీడర్స్ ను ప్రవేశ పెట్టింది. ఇండియాలో బ్యాక్ లైట్ లేకుండా బేసిక్ మోడల్ 5,999 రూ లకు వస్తుంది. బ్యాక్ లైట్ తో రాత్రులు కూడా చదువుకోవటానికి 8,999 నుండి 10,999 రూ వరకు పేపర్ వైట్ పేరుతో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి.
Kindle Oasis లో ఒక బ్యాటరీ డివైజ్ లోపల మరొక బ్యాటరీ కవర్ లో ఉన్నాయి. బ్యాక్ అప్ రెండు కలిపి 9 వారలు వస్తుంది మాక్సిమమ్. WiFi కూడా ఉంటుంది కామన్ అన్ని మోడల్స్ కు. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవటానికి అమెజాన్ లోని ఈ లింక్ లోకి వెళ్ళగలరు.
ఈ 8 th జనరేషన్ Kindle Oasis లో ఉన్న కొత్త add ons ఏంటి?
1. దీనితో పాటు ఒక కవర్ వస్తుంది. ఇది బ్యాటరీ ను చార్జింగ్ కూడా చేస్తుంది.
2. ప్రివియస్ మోడల్స్ కన్నా 30 శాతం సన్నగా, 20 శాతం తక్కువ బరువుతో వస్తుంది.
3. ఒక వైపు చేతితో పట్టుకోవటానికి గ్రిప్ కొరకు హోల్డింగ్ డిజైన్ కలిగి ఉంది.