ప్రపంచ అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ మరియు టెక్ దిగ్గజం అమెజాన్ ఇండియా కొత్తగా Amazon Bazaar ను తీసుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాలతో పాటుగా భారత్ లో కూడా ఎక్కువ ప్రాచుర్యం పొందిన అమేజాన్ ఈ కొత్త ఫీచర్ ను తీసుకు వచ్చింది. అమెజాన్ బజార్ పేరుతో తీసుకు వచ్చిన ఈ కొత్త ఫీచర్ తో లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ పైన ఎక్కవగా ద్రుష్టి పెడుతుంది.
లైఫ్ స్టైల్ కేటగిరి పైన ఎక్కవ ఫోకస్ చేస్తూ అమెజాన్ ఇండియా కొత్తగా తీసుకు వచ్చిన అమెజాన్ బజార్ నుండి బెస్ట్ క్లాత్ డీల్ ను ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, రూ. 600 రూపాయల కంటే తక్కువ ధరల లభించే బెస్ట్ ప్రోడక్ట్స్ ను అమెజాన్ బజార్ నుండి అందిస్తుందని తెలిపింది. లైఫ్ స్టైల్ విభాగంలో ఇప్పకే కొనసాగుతున్న రిలయన్స్ Ajio, meesho మరియు వాల్ మార్ట్ వంటి వారికి పోటీగా ఈ అమెజాన్ బజార్ ను నిలబెడుతోంది.
అమెజాన్ యాప్ మరియు వెబ్సైట్ (Amazon.in) లో మొదటి వరుసలో ఈ అమెజాన్ బజార్ ఉంటుంది.ఈ అమెజాన్ బజార్ నుండి చాలా మన్నికైన, చవకైన బట్టలు మరియు ఫ్యాషన్ ప్రోడక్ట్స్ ను ఆఫర్ చేస్తుందని చెబుతోంది. అమేజాన్ బజార్ నుండి రూ. 125 రూపాయల స్టార్టింగ్ రేటు నుండి ప్రోడక్ట్స్ ను లిస్ట్ చేస్తుందని మరియు ప్రోడక్ట్ హబ్ నేరుగా ప్రోడక్ట్స్ ను తక్కువ రేటుకే ఆఫర్ చేస్తుందని కూడా అమెజాన్ చెబుతోంది.
Also Read: 50MP సెల్ఫీ క్యామ్ తో వచ్చిన Samsung Galaxy M55 5G టాప్ ఫీచర్లు మరియు ప్రైస్ తెలుసుకోండి.!
అయితే, అమెజాన్ బజార్ కోసం కొత్త యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలా? అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఎటువంటి కొత్త యాప్ తో పని లేకుండా అమెజాన్ యొక్క రెగ్యులర్ యాప్ మరియు ఆన్లైన్ స్టోర్ నుండి ఈ ఫీచర్ ను పొందుతారు. దీనికోసం అమెజాన్ ఆన్లైన్ ప్లేట్ ఫామ్ పైన కనిపించే ‘బజార్’ (Bazaar) ఐకాన్ పైన టచ్ చేస్తే సరిపోతుంది.