అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ఇప్పుడు మరింత చవక రేటుకే అందుకోండి.!
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ను ఇప్పుడు మరింత చవక రేటుకే అందుకోవచ్చు
అమెజాన్ కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను మరింత చౌకగా విడుదల చేసింది
అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సర్వీస్ ను లాంచ్ చేసింది
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ ను ఇప్పుడు మరింత చవక రేటుకే అందుకోవచ్చు. ఎందుకంటే, అమెజాన్ కొత్త మొబైల్-ఓన్లీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను సాధారణ సబ్స్క్రిప్షన్ కంటే మరింత చౌకగా విడుదల చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ పేరుతో ఈ సర్వీస్ ను అమెజాన్ లాంచ్ చేసింది. వాస్తవానికి, సాధారణ అమెజాన్ ప్రైమ్ నెలవారీ సభ్యత్వం ఖరీదు రూ. 179 రూపాయలు. దీనితో ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ మరియు వన్-డే డెలివరీతో సహా మరిన్ని ప్రయోజనాలను అఫర్ చేస్తుంది. అయితే, ఇప్పుడు అమెజాన్ తెచ్చిన ఈ కొత్త మొబైల్-ఓన్లీ సబ్ స్క్రిప్షన్ మరింత చవక దరకే అందుతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్ స్క్రిప్షన్ పూర్తి సంవత్సరం ధర రూ.599 రూపాయలు మాత్రమే. ఇక మీరు నెల నెల చెల్లించేలా ప్లాన్ ను తీసుకోవాలనుకుంటే కేవలం రూ.50 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు. ఈ సబ్ స్క్రిప్షన్ తో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ప్లాట్‌ఫారమ్‌లోని మొత్తం కంటెంట్‌కు మీకు యాక్సెస్ లభిస్తుంది. అయితే, మీరు ఈ మొబైల్-ఓన్లీ సబ్ స్క్రిప్షన్ తో కంటెంట్ ను కేవలం SD లో మాత్రమే చూడగలరు. అంటే, వినియోగదారులు వారికి ఇష్టమైన సినిమాలు మరియు సిరీస్ లను Amazon Prime Video లో చూడవచ్చు, కానీ HD రిజల్యూషన్ లో చూడలేరు.
అయితే, కంటెంట్ ను టీవీలలో చేసేప్పుడు మాత్రమే మీకు SD రిజల్యూషన్ మరియు HD రిజల్యూషన్ మధ్య ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తుంది, మొబైల్ ఫోన్ లో మాకేయూ అంతగా వ్యత్యాసం అనిపించక పోవచ్చు. ప్రైమ్ వీడియో మొబైల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తో ప్రైమ్ డేస్ సేల్స్, ప్రైమ్ డీల్స్ డిస్కౌంట్ మరియు వన్-డే డెలివరీ వంటి అన్ని ప్రయోజాలను పొందుతారని గుర్తుంచుకోండి. కొత్త ప్లాన్‌ని ఎంచుకోవాలనుకునే వారు ఆండ్రాయిడ్, iOS లేదా వెబ్‌లోని ప్రైమ్ వీడియో యాప్‌లో దీన్ని ఎంచుకోవచ్చు.