బుక్స్ చదువుకోవటానికి ఇండియాలో కొత్త డివైజ్ ను రిలీజ్ చేసింది అమెజాన్

Updated on 23-Jun-2016

amazon ఇండియాలో కొత్త Kindle e-book reader ను రిలీజ్ చేసింది. దీని పేరు "New Kindle". ప్రైస్ – 5,999 రూ. అమెజాన్ లో ఆల్రెడీ ప్రీ సేల్స్ స్టార్ అయ్యాయి.

ఇది 6 in స్క్రీన్, e-ink డిస్ప్లే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మీకు పేపర్ లా ఉంటుంది స్క్రీన్. ఈ మోడల్ లో లైట్ లేదు. సో నైట్ times చదవలేరు.

ఎందుకంటే డిస్ప్లే బయట ఉండే లైటింగ్ ను తీసుకోని మీకు స్క్రీన్ పై అన్నీ చూపిస్తుంది. డార్క్ గా ఉండే ప్లేసెస్ లో పని చేయదు. డార్క్ ప్లేసెస్ లో కూడా పనిచేసేలా లైట్ తో పాటు నెక్స్ట్ మోడల్ ఉంది.

కేవలం రీడింగ్ మాత్రమే ఉంటుంది. అలాగే ఫేస్ బుక్ వంటి సింపుల్ సైట్స్ ను బ్రౌజ్ చేయగలరు అంతే! మరేతర పని చేయలేరు. అమెజాన్ kindle బుక్స్ స్టోర్ ఉంటుంది. కొత్త మోడల్ లో ప్రధానంగా తక్కువ బరువు (161గ్రా) మరియు మరింత సన్నని బాడీ ఉంది. 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :