Amazon Nova Sonic: మరింత అనువైన AI వాయిస్ మోడల్ అందించిన అమెజాన్.!

అమెజాన్ సరికొత్త AI వాయిస్ మోడల్ ను ప్రవేశపెట్టింది
నెక్ట్స్ జనరేషన్ AI వాయిస్ మోడల్ Amazon Nova Sonic ను అందించింది
ఈ కొత్త వాయిస్ మోడల్ Chat GPT 4.0 కంటే వేగంగా ఉంటుంది
Amazon Nova Sonic: అమెజాన్ సరికొత్త AI వాయిస్ మోడల్ ను ప్రవేశపెట్టింది. అదే, నెక్ట్స్ జనరేషన్ AI వాయిస్ మోడల్ నోవా సోనిక్. ఈ కొత్త వాయిస్ మోడల్ Chat GPT 4.0 కంటే వేగంగా ఉంటుంది మరియు 80% తక్కువ ఖర్చుతో వస్తుందని అమెజాన్ తెలిపింది. అమెజాన్ యొక్క ఈ కొత్త మోడల్ గొప్ప నాచురల్ సౌండ్ తో మాట్లాడటం మాత్రమే కాకుండా రియల్ టైమ్ ఇంటరాక్షన్ లను కూడా జరుపుతుందని కూడా అమెజాన్ చెబుతోంది.
Amazon Nova Sonic
Alexa వాయిస్ మోడల్ తో ప్రపంచ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన అమెజాన్, ఇప్పుడు కొత్త నోవా సోనిక్ AI వాయిస్ మోడల్ ను కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న పవర్ ఫుల్ AI వాయిస్ మోడల్స్ గూగుల్ లేటెస్ట్ AI మరియు OpenAI లకు గట్టి పోటీగా ఈ కొత్త వాయిస్ మోడల్ ను అమెజాన్ తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త వాయిస్ మోడల్ టోన్, స్టైల్ మరియు పేస్ ను కూడా అనుసరిస్తుందట. ఈ కొత్త మోడల్ మరింత వేగంగా మరియు ఖచ్చితంగా పనిచేసే విధంగా ఉంటుందట. ఈ కొత్త వాయిస్ మోడల్ AI అప్లికేషన్ లో దాదాపు మనిషి లాంటి వాయిస్ కాన్వర్జేషన్ లను అందిస్తుందని తెలిపింది. ఈ కొత్త మోడల్ ట్రావెల్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ మరియు హెల్త్ కేర్ వంటి మరిన్ని ప్రాంతాల్లో కస్టమర్ సర్వీస్ కాల్ ఆటోమేషన్ మరియు AI ఏజెంట్ గా ఉపయోగపడుతుంది.
మరింత మెరుగుపరచబడిన అమెజాన్ డిజిటల్ అసిస్టెంట్ Alexa+ కూడా ఈ కొత్త నోవా సోనిక్ ద్వారా అందించింది. తద్వారా మనిషి లాంటి కాన్వర్జేషన్ అందించేలా సరి చేయబడింది. వాస్తవానికి, మనిషిలాగే వాయిస్, విజన్ మరియు స్పందనల ఆదేశాలు మరింత ఖచ్చితంగా స్వీకరించే మోడల్ ను నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది.
Also Read: అండర్ రూ. 30,000 బెస్ట్ 55 ఇంచ్ QLED Smart Tv డీల్ ఇదే.!
ఇదే కనుక నిజమైతే ఇప్పటికే రోబోట్ నిర్మాణాలతో దూసుకుపోతున్న టెక్నాలజీ వరల్డ్, మనిషిలాగే ఫీల్ అయ్యే పూర్తి స్థాయి రోబోట్ నిర్మానికి బాటలు వేసే దిశగా దూసుకుపోతుంది. మరి ముందు ముందు అమెజాన్ ఈ కొత్త వాయిస్ మోడల్ ఇంకా ఎటువంటి కొత్త అప్డేట్స్ అందిస్తోందో చూడాలి.