అమెజాన్ ఇండియా కి 10 వసంతాలు..అమెజాన్ ఏమంటోందంటే.!

అమెజాన్ ఇండియా కి 10 వసంతాలు..అమెజాన్ ఏమంటోందంటే.!
HIGHLIGHTS

అమెజాన్ ఇండియాలో అడుగుపెట్టి 10 వసంతాలు అవుతోంది

అమెజాన్ ఇండియా 13 జూన్ 2013 న ఇండియాలో ప్రారంభం అయ్యింది

అభిమానులు మరియు యూజర్లు వారి అభిప్రాయాలను పంచుకున్నారు

ప్రముఖ ఈకామర్స్ కంపెనీ అమెజాన్, ఇండియాలో అడుగుపెట్టి 10 వసంతాలు అవుతోంది. అమెజాన్ ఇండియా 13 జూన్ 2013 న ఇండియాలో ప్రారంభం అయ్యింది మరియు నేటితో 10 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో తనకు సహకరించిన కంపెనీలు, కస్టమర్లు, కంపెనీ ఉద్యోగులు మరియు ప్రతి ఒకరిని గుర్తు చేస్తునట్లు అమెజాన్ ప్లాట్ఫామ్ పైన మైక్రో సైట్ బ్యానర్ ద్వారా వెల్లడించింది.

అమెజాన్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి 'ఈ 10 సంవత్సరాల ప్రయాణం మీ కలిసి గొప్పగా సాగింది, మీ జీవితంలో మమ్మల్ని కూడా ఒక భాగంగా చేసినందుకు మీ అందరికి వందనాలు' అని అమెజాన్ తన కృతజ్ఞతలను తెలిపింది. అంతేకాదు, ఈ సందర్భంగా మాతో మీ ప్రయాణం ఎలా సాగింది, అని కూడా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు చాలా కంపెనీలు మరియు యూజర్లు కూడా స్పందించారు. 

ఈ ప్రశ్నకు Xiaomi స్పందిస్తూ, Innovation for every One లో భాగంగా మనం కలిసి మిలియన్ల కొద్దీ  Redmi నోట్ సిరీస్ ఫోన్లను సేల్ చేశాము, అని షియోమి అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్ చేసింది.

 

 

ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ boAt కూడా అమెజాన్ ప్రశ్నకు బదులిచ్చింది. ఈ ట్వీట్ క్రింద చూడవచ్చు. 

 

 

కేవలం కంపెనీలు మాత్రమే కాదు, అమెజాన్ ఇండియా అభిమానులు మరియు యూజర్లు కూడా వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo