ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ రేటు పెంచిన అమెజాన్..ఎంతంటే..!

Updated on 08-May-2023
HIGHLIGHTS

ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్స్ రేటును పెంచింది

ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్రైమ్ మెంబర్ షిప్ ప్లాన్స్ రేటును పెంచింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్ లకు నిజంగా షాకింగ్ న్యూస్. ఎందుకంటే, ఇటీవలే అమెజాన్ తన ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లావు నెల మరియు మూడు నెలల ప్లాన్స్ పైన మాత్రమే ఈ ప్రైస్ హైక్ నిర్ణయం తీసుకుంది. అయితే, సంవత్సరం సబ్ స్క్రిప్షన్ రేటులో మాత్రం ఏటివంటి మార్పులు లేకపోవడం విశేషం. 

అమెజాన్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం కేవలం నెల మరియు మూడు నెలల సబ్ స్క్రిప్షన్ కోసం చూసే వారికి మాత్రమే వర్తిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబెర్ వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ చేసే వారికి,అదే పాత రూ. 1,499 ధరలోనే లభిస్తోంది. పాత మరియు కొత్త ప్లాన్ధరల వ్యత్యాసాలను గురించి క్రింద చూడవచ్చు. 

అమెజాన్ ప్రైమ్ ఒక నెల ప్లాన్:

రూ. 179 ధరలో లభించిన అమెజాన్ ప్రైమ్ మెంబర్ నెల ప్లాన్ కోసం ఇప్పుడు రూ. 299 ఖర్చు చేయవలసి ఉంటుంది. 

అమెజాన్ ప్రైమ్ మూడు నెలల ప్లాన్

మూడు నెలల ప్లాన్ మూడు రూ. 459 రూపాయలకు లభిస్తుండగా ఇప్పడు రూ. 599 రూపాయలకు పెరిగింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :