అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వస్తోంది..గ్రేట్ ఆఫర్లు తెస్తోంది..!!

Updated on 07-Sep-2022
HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని అనౌన్స్ చేసిన అమెజాన్

ఈ సేల్ నుండి అందించనున్న డీల్స్ మరియు ఆఫర్లను వెల్లడించిన అమెజాన్

ప్రతి సంవత్సరం కూడా పండుగ సీజన్ ప్రారంభవుతూనే అమెజాన్ తన ఈ సేల్ ను ప్రారంభిస్తుంది

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని అనౌన్స్ చేసిన అమెజాన్. అమెజాన్ ఈ అప్ కమింగ్ సేల్ ని నిర్వహించనున్న తేదీలను ఇంకా ప్రకటించనప్పటికీ, ఈ సేల్ నుండి అందించనున్న డీల్స్ మరియు ఆఫర్లను గురించి మాత్రం వెల్లడించింది.  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన బ్యానర్ పేజ్ నుండి అందించిన టీజింగ్ ద్వారా ఈ విషయాలను వెల్లడించింది. ఈ సేల్ నుండి యూజర్లు అతి భారీ డిస్కౌంట్ మరియు డీల్స్ ను అందుకునే అవకాశం ఉన్నట్లు, బ్యానర్ పేజ్ నుండి అందించిన టీజింగ్ ద్వారా తెలుస్తోంది.          

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి SBI బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను జతచేసింది.     

ప్రతి సంవత్సరం కూడా పండుగ సీజన్ ప్రారంభవుతూనే అమెజాన్ తన ఈ సేల్ ను ప్రారంభిస్తుంది. ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. అదే విదంగా ఈ సంవత్సరం కూడా ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు కూపన్స్ వంటి మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది.

Amazon Great Indian Festival 2022 నుండి ఏమి ఆశించవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ ఫోన్స్, టీవీలు మరియు ఆడియో ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ను ఆశించవచ్చు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎలక్ట్రానిక్స్ పైన మరిన్ని ఆఫర్లను అందించే అవకాశం వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :