మరొకసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించిన అమెజాన్.!

మరొకసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించిన అమెజాన్.!
HIGHLIGHTS

అమెజాన్ మరొకసారి తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని ప్రకటించింది

ఈ అప్ కమింగ్ సేల్ నుండి అనేక ప్రొడక్ట్ లను భారీ డిస్కౌంట్ తో తీసుకువస్తునట్లు చెబుతోంది

ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది

అమెజాన్ మరొకసారి తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని ప్రకటించింది. అమెజాన్ ప్రకటించిన ఈ అప్ కమింగ్ సేల్ నుండి అనేక ప్రొడక్ట్ లను భారీ డిస్కౌంట్, డీల్స్ మరియు ఇతర లాభాలను అందించే ఆఫర్లతో తీసుకువస్తునట్లు చెబుతోంది. అమెజాన్ యొక్క ఈ అప్ కమింగ్ సేల్ యొక్క డేట్ ప్రస్తుతానికి ప్రకటించనప్పటికీ ఈ సేల్ ని త్వరలోనే ప్రారంబిస్తుందని ఆశించవచ్చు. మరి త్వరలో రానున్న ఈ అమెజాన్ అతిపెద్ద సేల్ నుండి మనం ఎటువంటి ఆఫర్లను ఆశించవచ్చునో తెలుసుకుందాం పదండి.  

 గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని SBI బ్యాంక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి SBI బ్యాంక్ యొక్క క్రెడిట్, డెబిట్ కార్డు లేదా EMI ద్వారా వస్తువులను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను జతచేసింది.      

ప్రతి సంవత్సరం కూడా పండుగ సీజన్ ప్రారంభవుతూనే అమెజాన్ తన ఈ సేల్ ను ప్రారంభిస్తుంది. ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. అదే విదంగా ఈ సంవత్సరం కూడా ల్యాప్ టాప్స్, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, No Cost EMI మరియు కూపన్స్ వంటి మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది. 

Amazon Great Indian Festival 2022 నుండి ఏమి ఆశించవచ్చు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుండి లేటెస్ట్ మొబైల్ ఫోన్స్, టీవీలు మరియు ఆడియో ప్రోడక్ట్స్ పైన భారీ డీల్స్ ను ఆశించవచ్చు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎలక్ట్రానిక్స్ పైన మరిన్ని ఆఫర్లను అందించే అవకాశం వుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo