Apple iPad Deal: లేటెస్ట్ యాపిల్ ఐప్యాడ్ పై అమెజాన్ సేల్ బిగ్ డీల్.!

Updated on 08-Oct-2024
HIGHLIGHTS

Apple iPad పైన అమెజాన్ ధమాకా ఆఫర్

ఐప్యాడ్ భారీ డిస్కౌంట్ 30 వేల కంటే తక్కువ ధరకే లభిస్తోంది

బడ్జెట్ ధరలో iPad అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది

Apple iPad Deal: ఐప్యాడ్ కొనాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారా? అయితే, మీకోసం ఒక గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈరోజు యాపిల్ యొక్క లేటెస్ట్ ఐప్యాడ్ (10th Generation) ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో 30 వేల కంటే తక్కువ ధరలో లభిస్తోంది. పెద్ద 10 ఇంచ్ లిక్విడ్ రెటీనా స్క్రీన్ మరియు పవర్ సౌండ్ అందించే క్వాడ్ స్పీకర్లతో పాటు పవర్ ఫుల్ చిప్ సెట్ తో పని చేసే ఈ యాపిల్ ఐప్యాడ్ ను ఈరోజు బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అమెజాన్ అందించింది.

ఏమిటా Apple iPad Deal?

యాపిల్ ఐప్యాడ్ (10th Generation) బేసిక్ 64GB వేరియంట్ ప్రస్తుతం మార్కెట్లో రూ. 34,900 రూపాయల ధరతో లభిస్తుండగా, అమెజాన్ ఈ ఐప్యాడ్ పై భారీ డిస్కౌంట్ అందించింది. ఈ ప్యాడ్ ఈరోజు రూ. 4,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో రూ. 30,999 రూపాయల ఆఫర్ ధరకే అమెజాన్ నుంచి లభిస్తోంది.

ఈ ఐప్యాడ్ ను మరింత చవక ధరలో అందుకోవడానికి వీలుగా ఈ ప్యాడ్ పై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అమెజాన్ జత చేసింది. అవేమిటంటే, ఈ ఐప్యాడ్ ను SBI డెబిట్ కార్డ్ తో కొనేవారికి రూ. 1,000 డిస్కౌంట్ మరియు SBI క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ ను అందిస్తుంది.

ఈ SBI బ్యాంక్ ఆఫర్స్ తో ఈ లేటెస్ట్ ఐప్యాడ్ ను రూ. 29,999 రూపాయల కంటే తక్కువ ధరకే అందుకునే అవకాశం లభిస్తుంది. ఆఫర్ రేటుకే ఈ ప్యాడ్ ను కొనడానికి Buy From Here పై నొక్కండి.

Also Read: itel Flip One: కేవలం రూ. 2,499 రూపాయలకే ఫ్లిప్ కొత్త ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్.!

Apple iPad (10th Generation) : ఫీచర్స్

ఈ యాపిల్ ఐప్యాడ్ (10th Generation) 10.9 ఇంచ్ లిక్విడ్ రెటీనా స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ sRGB colour మరియు ట్రూ టోన్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ ఐప్యాడ్ A14 Bionic చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

కెమెరాల పరంగా, ఈ ఐప్యాడ్ లో ముందు మరియు వెనుక 12MP కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 4K వీడియోలు షూట్ చేయవచ్చు. ఈ ఐప్యాడ్ యాపిల్ పెన్సిల్ మరియు మ్యూజిక్ కీ బోర్డు లకు సపోర్ట్ చేస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :