ఫ్లిప్ కార్ట్ తాజాగా బిగ్ బిలియన్ సేల్ ను అనౌన్స్ చేసింది. ఇది గత ఏడాది నుండి ప్రారంభం అయ్యింది. అయితే వెంటనే payTM కూడా ఫెస్టివల్ సేల్స్ అంటూ అనౌన్స్ చేసింది.
ఇప్పుడు ఇదే వరుసలో అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ అనే పేరుతో ఫ్లిప్ కార్ట్ కు పోటీగా భారి డిస్కౌంట్ సేల్స్ ను స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
ఈ అమెజాన్ సేల్ అక్టోబర్ 13 నుండి 17 వరకూ ఉంటుంది. అయితే ఈ సారి ఫ్లిప్ కార్ట్ కన్నా మిగిలిన వెబ్ సైట్స్ లో ఎక్కువ సేల్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకంటే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ కేవలం అప్లికేషన్ లో ఉంటాయి. వెబ్ సైట్ లో ఆఫర్స్ ఉండవు. అమెజాన్ మాత్రం రెండింటిలోనూ ఇస్తుంది ఆఫర్స్.
అయితే అమెజాన్ వెబ్ సైట్ లో కన్నా 15 నిముషాలు ముందు అమెజాన్ యాప్ వాడే వారికి కనిపిస్తాయి గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ ఆఫర్స్ అన్నీ. అంతే కాదు అడిషనల్ గా hdfc క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా.
దీనితో పాటు అమెజాన్ అప్లికేషన్ లో అక్టోబర్ 16 మరియు 17 న కేవలం యాప్ లో మాత్రమే కొన్ని ఎక్స్క్లూసివ్ ఆఫర్స్ ఉంటాయి.