అమెజాన్ అసిస్టెంట్ అనే బ్రౌజర్ ఎక్స్టెన్షన్ ను విడుదల చేసింది అమెజాన్

Updated on 05-May-2016
HIGHLIGHTS

షాపింగ్ వైజ్ గా కొన్ని క్విక్ లింక్స్ ఇస్తుంది.

అమెజాన్ ఇండియా వెబ్ సైట్ Amazon Assistant అనే కొత్త డెస్క్ టాప్ బ్రౌజర్ extension విడుదల చేసింది. ఈ లింక్ లో అమెజాన్ అసిస్టెంట్ extension ను డౌన్లోడ్ చేయగలరు. టోటల్ గా 8 డెస్క్ టాప్ బ్రౌజర్లకు సపోర్ట్ చేస్తుంది.

ఇది అందించే uses..

  • మీరు ఇంటర్నెట్ లో ఏ సైట్ లో అయినా ఒక ప్రోడక్ట్ చూస్తున్నప్పుడు అది అమెజాన్ లో ఉంటే కనుక మీ బ్రౌజర్ పైన అమెజాన్ ప్రైస్, రేటింగ్స్ అండ్ ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ అక్కడికక్కడే చూపిస్తుంది.
  • అమెజాన్ లో ఏదైనా వెంటనే సర్చ్ చేయగలరు.
  • సర్చ్ చేసిన ప్రోడక్ట్ లను వెంటనే అమెజాన్ ఫుల్ వెబ్ సైట్ లో ఓపెన్ చేయటానికి క్విక్ లింక్స్.
  • ఇంటర్నెట్ లో ఏ సైట్ లో అయినా మీకు నచ్చిన ప్రోడక్ట్ ఉంటే దానిని అమెజాన్ wish list లో సేవ్ చేయగలరు.
  • అమెజాన్ లో కొత్తగా ప్రవేశ పెట్టిన విషయాలు, ఆఫర్స్ వంటివి ఏమైనా ఉంటే కార్డ్స్ రూపంలో తెలియజేస్తుంది.
  • deal of the day వంటివి కూడా వెంటనే నోటిఫై చేస్తుంది.
  • మీరు కొన్న ప్రోడక్ట్ యొక్క షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ exclusive ఆఫర్స్ వంటివి కూడా ఈ ఎక్స్టెన్షన్ ద్వారా అందిస్తుంది.

 

డీల్స్ చూడటనికి రైట్ కార్నర్ లో అమెజాన్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇంకా ప్రోడక్ట్ కంపేరిజన్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోగలరు. ఎక్స్టెన్షన్ లో పైన లెఫ్ట్ సైడ్ ఉన్న సెట్టింగ్స్ సింబల్ పై క్లిక్ చేస్తే డీల్స్ గురించి ఆటోమేటిక్ గా వచ్చే నోటిఫికేషన్స్ ను కూడా ఆఫ్ చేసుకోగలరు, 

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :