అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ వస్తోంది : అక్టోబరు 10 నుండి అక్టోబరు 15 వరకు
అర్హతగల అన్ని పరికరాల పైన, డెబిట్ ,క్రెడిట్ మరియు బజాజ్ ఫిన్ సర్వ్ కార్డ్ లతో నో కాస్ట్ EMI తోపాటు గొప్ప తగ్గిపుధరలు మరియు డీల్స్ ని తెస్తోంది అమేజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ లో. అదనంగా, అమేజాన్ పే మరియు డెబిట్ కార్డులతో 1 లక్ష రూపాయల వరకు EMI లోన్ పొందే అవకాశం.
అక్టోబర్ 10 నుండి అక్టోబరు 15 వరకు జరుగనున్న ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ని అమెజాన్ ప్రకటించింది. అక్టోబర్ 10 న అర్ధరాత్రి 12 గంటలకు ప్రారంభమై, అక్టోబరు 15 న 11:59 గంటలకు ఈ సేల్ ముగియనుంది. ప్రతి ఏడాది వలనే, ఈ ఆన్లైన్ రిటైలర్ వివిధ కేటగిరీలు నుండి ఉత్పత్తులపైన అంతటా డిస్కౌంట్లు, ఒప్పందాలు మరియు గొప్ప ఆఫర్లు అందించనుంది . దాని ప్రత్యర్థి ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్ అయిన ఫ్లిప్కార్ట్, అక్టోబర్ 10 న తన బిగ్ బిలియన్ డేస్ విక్రయాలను ప్రకటించిన తర్వాత అమెజాన్ యొక్క ఈ ప్రకటన వెలువడింది. అమెజాన్ దాని 'అమెజాన్ ఫెస్టివ్ హోమ్' ప్రకటన చేసింది, ఇది మూడు అంతస్తుల బంగ్లానీ రెండు వారాలలో 16000 కంటే ఎక్కువ ఉత్పత్తులతో అమెజాన్ హోమ్ గా మార్చింది. ఎప్పటిలాగే, అమెజాన్ ప్రైమ్ కస్టమర్లు అక్టోబర్ 9 నుండే విక్రయానికి ముందస్తుగా ప్రాప్తి పొందుతారని గమనించాలి.
అమెజాన్ యొక్క రాబోయే అమ్మకానికి ఏ ప్రత్యేకతలు ఇంకా వెల్లడించలేదు, కానీ అమ్మకానికి 380,000 బ్రాండ్ల యొక్క 172 మిలియన్ల ఉత్పత్తులతో దాని అతిపెద్ద కార్యక్రమంగా ఉండనుందని అని చెప్పింది. ఈ సేల్ లో, రెడ్మి 6 సిరీస్ స్మార్ట్ఫోన్లు, హానివెల్ మరియు డైసన్ బ్రాండ్ల గాలి శుద్దీకరణ యంత్రాలు వంటి ఉత్పత్తులు కూడా ఈ సందర్భంగా కొనుగోలు కోసం అందుబాటులో ఉంటాయి. డెబిట్ మరియు క్రెడిట్ కార్డులు మరియు బజాజ్ ఫిన్ సర్వ్ కార్డులపై ఎటువంటి వ్యయము లేని EMI లతో కొనుగోలు చేయగలిగే అవకాశం ఉంటుంది. అర్హతగల అన్ని పరికరాల పైన, EMI తో పాటు అమెజాన్ పే మరియు డెబిట్ కార్డులతో 1 లక్ష వరకు రుణం పొందవచ్చు. తమ అమెజాన్ పే బ్యాలెన్స్ టాప్ అప్ చేసినపుడు 300 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది మరియు SBI డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా తమ కొనుగోళ్ల మీద వినియోగదారులు 10 శాతం తగ్గింపు పొందుతారు.
ఈ రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో, ఒక స్మార్ట్ఫోన్ ని పెద్ద టీవీల వంటి కొన్ని ఇతర పెద్ద ఉపకరణాలతో పాటు మార్పిడి(ఎక్స్చేంజి) చేసుకోవచ్చు. ఈ ఆన్లైన్ రిటైలర్ 48 గంటల్లో కొత్త టీవీలను పంపిణీ చేయడం మరియు ఇన్స్టాల్ చేయడం చేస్తుంది.