యూట్యూబ్ లో సునామి సృష్టిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ వీడియో సాంగ్..!

యూట్యూబ్ లో సునామి సృష్టిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ వీడియో సాంగ్..!
HIGHLIGHTS

Coke Studio స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పైన చిత్రీకరించిన లేటెస్ట్ వీడియో సాంగ్

అల్లు అర్జున్ లేటెస్ట్ వీడియో సాంగ్ 'మేము ఆగము అసలు ఆగము'

ఒక్కరోజులోనే 10 లక్షలకు పైగా వ్యూస్ ను సాధించింది

Coke Studio స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పైన చిత్రీకరించిన లేటెస్ట్ వీడియో సాంగ్ 'మేము ఆగము అసలు ఆగము' మ్యూజిక్ సాంగ్ యూట్యూబ్ లో సునామి సృష్టిస్తోంది. ఈ మ్యూజిక్ వీడియో సాంగ్ విడుదల చేసిన ఒక్కరోజులోనే 1 మిలియన్, అంటే 10 లక్షలకు పైగా వ్యూస్ ను సాధించింది. ఈ వీడియో సాంగ్ లో అల్లు అర్జున్ మరియు కొరియన్ గర్ల్స్ బ్యాండ్ tri.be స్టెప్స్ వేయగా, అర్మాన్ మాలిక్ ఈ పాటను పాడారు. ఈ సాంగ్ కేవలం ఒక్కరోజులోనే 1 మిలియన్ వ్యూస్ సాధించిందంటే నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ముఖ్యంగా, పుష్ప సినిమాలోని 'సామీ సామీ' ఫెమస్ స్టెప్ ను కొరియన్ గర్ల్స్ మరియు అల్లు అర్జున్ కలిసి వెయ్యడం అద్భుతంగా కనిపించింది. Coke Studio నిర్మించిన ఈ మ్యూజిక్ వీడియో సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ ను అర్మాన్ మాలిక్ ఆవిష్కరించారు మరియు ఇప్పటికే ఈ వీడియో దాదాపుగా 15 లక్షలకు పైగా వ్యూస్ అందుకుంది. ఈ మ్యూజిక్ వీడియో గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అద్భుతం అని చెప్పవచ్చు.

ఈ మ్యూజిక్ సాంగ్ లో కొరియన్స్ చేత కూడా పుష్ప స్టెప్స్ వేయించడం మరియు మరియు 'ప్రపంచం మొత్తంతో స్నేహం చేద్దాం' అని ఈ పాట చెప్పడం మరింతగా గొప్పగా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo