ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న అల్లు అర్జున్ ‘మేము ఆగము’ సాంగ్.!

Updated on 23-Aug-2022

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త మ్యూజిక్ వీడియో సాంగ్ 'మేము ఆగము అసలు ఆగము' నిన్న ఆవిష్కరించబడింది. అర్మాన్ మాలిక్ ఈ పాటను ఆలాపించగా అల్లు అర్జున్ మరియు  కొరియన్ గర్ల్స్ బ్యాండ్ tri.be స్టెప్స్ వేశారు. ఈ పాట తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ మూడు భాషలను కలిపి అందించడం విశేషం. ఇక స్టైల్ మరియు డాన్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన అల్లు అర్జున్ డాన్స్ మరియు స్టైల్ ఈ మ్యూజిక్ వీడియోకి ప్రాణం పోశాయి. ఈ పాటలో అల్లు అర్జున్ కొత్త లుక్ లో మెరిసిపోవడమే కాకుండా చాలా సింపుల్ స్టెప్స్ తో చాలా కూల్ గా అలరించారు.   

ఈ కొత్త మ్యూజిక్ వీడియో సాంగ్ లో పుష్ప సినిమాలోని 'సామీ సామీ' ఫెమస్ స్టెప్ ను కొరియన్ గర్ల్స్ మరియు అల్లు అర్జున్ కలిసి వెయ్యడం అద్భుతంగా కనిపించింది. Coke Studio నిర్మించిన ఈ మ్యూజిక్ వీడియో సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ ను నిన్న అర్మాన్ మాలిక్ ఆవిష్కరించారు మరియు ఇప్పటికే ఈ వీడియో దాదాపుగా 4 లక్షల వరకూ వ్యూస్ అందుకుంది. ఈ మ్యూజిక్ వీడియో గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, అద్భుతం అని చెప్పవచ్చు. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :