పుష్ప-2: ఆ RRR రికార్డ్ బ్రేక్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ.!

పుష్ప-2: ఆ RRR రికార్డ్ బ్రేక్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ.!
HIGHLIGHTS

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ లాంటి అప్డేట్

ప్రీ రిలీజ్ కలెక్షన్స్ లో పుష్ప 2: ది రూల్ సరికొత్త రికార్డు

RRR రికార్డ్ ను బ్రేక్ చెయ్యడమే కాకుండా కొత్త రికార్డ్ సెట్ చేసింది

అల్లు అర్జున్ బ్లాక్ బాస్టర్ మూవీ 'పుష్ప: ది రైజ్' 2022 గత ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కేవలం మన దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా గొప్ప గుర్తింపు సాధించింది. 'పుష్ప ని యవ్వ తగ్గేదెలా' అని పలకని నోరు లేదంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. కేవలం మన తెలుగు వారే కాదు నార్త్ ప్రజలు మరియు ఫారెనర్ లతో సహా పలువురు ప్రముఖులు కూడా ఇదే డైలాగు ఇమిటేషన్ వీడియోలను షేర్ చేసారు. ఇప్పుడు ఇదే డైలాగు సరిగ్గా సరిపోయేలా కొత్త రికార్డ్ ను పుష్ప-2 నెలకొల్పినట్లు తెలుస్తోంది.        

పుష్ప-2 సినిమా షూటింగ్ ప్రారంభమైనా ఇప్పటి వరకూ ఎటువంటి యాప్ట్ ను చిత్ర యూనిట్ వెల్లడించక పోవడంతో, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప-2 అప్డేట్ ను త్వరగా ఇవ్వాలని, గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద ఆందోళనుకు దిగారు. కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండగ లాంటి అప్డేట్ బయటికి వచ్చింది. అదేమిటంటే, పుష్ప 2: ది రూల్ ప్రీ రిలీజ్ కలెక్షన్స్ లో సరికొత్త రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది. ట్రాక్ టాలీవుడ్ నివేదిక ప్రకారం, ఈ సినిమా మేకర్స్ ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ హక్కులను 80 కోట్ల రూపాయలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది.

అంటే, ఇది RRR యొక్క ఓవర్సీస్ థియేట్రికల్ ఫ్రాంచైజీని కూడా అధిగమించినట్లే. ఈ హక్కుల కోసం RRR రూ. 70 కోట్లను వసూలు చేసింది. అయితే పుష్ప: ది రూల్ థియేట్రికల్ హక్కులు రూ. 10 కోట్లు ఎక్కువ సాధించి RRR యొక్క ఆ రికార్డ్ ను బ్రేక్ చెయ్యడమే కాకుండా కొత్త రికార్డ్ సెట్ చేసింది. తెలుగు సినిమాలు కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. రీసెంట్‌గా జపాన్‌లో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ అక్కడ కూడా అద్భుతాలు చేసింది. ఈ సినిమా విడుదలైన 17 రోజుల్లో 10 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాదు, RRR ఇప్పుడు 3 ఇడియట్స్‌ని అధిగమించి జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.

ఇక పుష్ప: ది రూల్ విషయానికి వస్తే, ప్రస్తుతానికి సినిమా మేకర్స్ మూవీ రిలీజ్ కోసం ఎటువంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే, ఈ చిత్రం 2023 ద్వితీయార్థంలో థియేటర్లలోకి రానుందని మాత్రం తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo