మొన్న Jio, నిన్న BSNL ఈ రోజు Airtel కొత్త 90 days కు 4G డేటా ఆఫర్ లాంచ్

మొన్న Jio, నిన్న BSNL ఈ రోజు Airtel కొత్త 90 days కు 4G డేటా ఆఫర్ లాంచ్

Airtel కొత్త 4G ఇంటర్నెట్ ఆఫర్ ను అనౌన్స్ చేసింది ఈ రోజు. 90 రోజుల validity తో 30GB ఇంటర్నెట్ డేటా ఇస్తుంది. ప్రైస్ 1,495 rs. కొత్తగా సిమ్ తీసుకునే వారికి మొదటి రీచార్జ్ గా 1,494 రూ అదే ఆఫర్.

అంటే 1GB కు సుమారు 50 రూ ఖర్చు చేస్తుంది. అయితే మొత్తం 1,495 rs ఖర్చు పెడితేనే కాని ఇది వర్తించదు. ప్రస్తుతానికి ఇది డిల్లీలో అమల్లో ఉంది. కొద్ది రోజుల్లో ఇతర సిటీస్ కు కూడా విస్తరించనుంది. 30GB డేటా మించితే స్పీడ్ 2G ఇంటర్నెట్ స్పీడ్ కు పడిపోతుంది.

గత నెలలో ఇంచుమించు ఇలాంటి ఆఫరే.. Mega Saver ప్లాన్స్ అంటూ కూడా కొన్ని ఆఫర్స్ లాంచ్ చేసింది. సంవత్సరానికి 1,498 రూ కడితే, 1GB 4G డేటా ను 51 రూ రీచార్జ్ కు ఇస్తుంది ఈ ఆఫర్ లో.

అయితే ఇది కేవలం సిటీస్ లో ఉన్న సీరియస్ అవసరం ఉన్న వారికే మంచి న్యూస్ అని చెప్పాలి. మిగిలిన కస్టమర్స్ కు ఏ మాత్రం సంతృప్తి పరిచే ఆఫర్ కాదు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo