రీసెంట్ గా Jio నెట్ వర్క్ కు ఇవ్వవలసిన అన్ని ఇంటర్ కనెక్టింగ్ పాయింట్స్ (PoIs) ఇవ్వనందుకు TRAI(టెలికాం రేగులేటరీ ఆఫ్ ఇండియా) ఎయిర్టెల్, ఐడియా అండ్ vodafone కు 3,050 కోట్లు జరిమానా వేయటం జరిగింది. (పూర్తీ స్టోరీ లింక్)
టోటల్ 3,050 కొట్లలో ఎయిర్టెల్ కట్టవలసినది 1050 కోట్లు. ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ దీనిపై స్పందిస్తూ.. "Time వచ్చినప్పుడు TRAI విధించిన జరిమానా పై respond అవుతాము" అని అన్నారు.
Jio కు ఎయిర్టెల్ ఇంటర్ కనెక్టింగ్ పాయింట్స్ ఇవ్వటానికి నిరాకరించటం అనేది మిట్టల్ వ్యతిరేకించారు. అసలు ఇంటర్ కనెక్టింగ్ పాయింట్స్ ఇష్యూ నే కాదు అని అంటున్నారు.
అలాగే సెకెండ్ క్వార్టర్ లోని ఎయిర్టెల్ రిసల్ట్స్ ను రిలీజ్ చేసింది కంపెని. రిలయన్స్ Jio అందించిన free ఆఫర్స్ కారణంగా తమ లాభాలు క్రిందకు పడినట్లు చెబుతుంది ఎయిర్టెల్.