free unlimited కాల్స్ సపోర్ట్ తో ఎయిర్టెల్ సూపర్ ఫాస్ట్ V-fiber బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ లాంచ్

Updated on 04-Nov-2016

Airtel కొత్తగా V-Fiber అనే పేరుతో సూపర్ ఫాస్ట్ broadband సర్వీసెస్ ప్రవేసపెట్టింది. ఇది 100MBPS స్పీడ్ తో ఉంటుంది. మొదటిగా చెన్నై లో లాంచ్ అవగా…

కొన్ని వారాల్లోనే మిగిలిన సిటీస్ లో కూడా లాంచ్ అవనుంది. అయితే స్పీడ్ పెంచుతుంది కాని బ్రాడ్ బాండ్ ప్లాన్స్ ను మాత్రం అవే prices లో అందిస్తున్నట్లు వెల్లడించింది.

ఇక నుండి బ్రాండ్ బాండ్ కనెక్షన్ ద్వారా V-Fiber సర్వీస్ వాడె వారికీ unlimited కాల్స్ సపోర్ట్ కూడా ఇస్తుంది. ఇంతకముందు కేవలం కొన్ని ప్లాన్స్ కే ఇస్తూ వచ్చింది ఈ సదుపాయం.

కొత్తగా బ్రాడ్ బాండ్ తీసుకునే వారికీ మరియు ఆల్రెడీ ఎయిర్టెల్ వాడుతున్న అందరికీ V-Fiber సర్వీస్ అందుతుంది. కంపెని సైట్ (లింక్) లోకి వెళ్లి సర్వీస్ పై మరింత సమాచారం తెలుసుకోవటం తో పాటు ప్రీ బుకింగ్ కూడా చేసుకోగలరు.

కొత్త స్పీడ్స్ కావాలంటే ఆల్రెడీ ఉన్న మోడెమ్స్ కాకుండా కొత్త మోడంస్ వాడాలి. ఇది chargeble కాని కస్టమర్ కు స్పీడ్ లో satisfaction లేకపోతే మోడెమ్ డబ్బులు తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించింది.

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :