ఎయిర్టెల్ ఇండియాలో రేపు పేమెంట్స్ బ్యాంకు సర్వీస్ లాంచ్ చేస్తుంది. ఇది ఫుల్ డిజిటల్ paperless బ్యాంకు. ఆధార కార్డ్ సహాయంతో e-KYC పద్దతిలో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోగలరు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు లో. డాకుమెంట్స్ ఏమీ అవసరం లేదు. కేవలం ఆధర్ కార్డ్ నంబర్ చాలు. దీని ద్వారా మీరు ఏ బ్యాంకు అకౌంట్ కు అయినా మనీ transfer చేసుకోగలరు. ఎయిర్టెల్ నుండి ఎయిర్టెల్ నంబర్స్ కు కూడా transfer చేస్తే సర్వీస్ చార్జ్ ఫ్రీ. సేవింగ్స్ ఖాతా లో వేసే అమౌంట్ కు ఎయిర్టెల్ 7.25 పెర్సెంట్ annual ఇంట్రెస్ట్ ఉంది. పర్సనల్ గా users కు ఒక లక్ష రూ accidental ఇన్సురన్సు ఇస్తుంది ప్రతీ సేవింగ్స్ అకౌంట్ కు. అమౌంట్ డిపాజిట్ అండ్ withdrawl కొరకు ఎయిర్టెల్ రిటైల్ స్టోర్స్ అన్నీ పనిచేస్తాయి. అయితే ప్రతీ withdrawl కు కంపెని 0.65% ఛార్జింగ్ ఫీజు తీసుకుంటుంది. ఇది కేవలం కాష్ వాడుకం తగ్గించి డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సాహం చేయటానికే అని అంటుంది కంపెని. ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, రాజస్థాన్ వంటి స్టేట్స్ లో మొదలయ్యింది. మరోవైపు Paytm కూడా పేమెంట్ బ్యాంకు ను స్థాపించేందుకు అనుమతి తెచ్చుకుంది.