రిలయన్స్ జియోతో పోటీ పడేందుకు భారతి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 799 రూపాయల ప్లాన్ ని సవరించింది. ఈ ప్లాన్ కింద, ప్రీపెయిడ్ కస్టమర్లు రోజుకు 3.5GB 3G / 4G డేటాను పొందగలుగుతారు, అపరిమిత లోకల్ , STD మరియు రోమింగ్ కాల్స్. అంతేకాక, లోకల్ మరియు ఎస్.టి .డి. SMS సౌకర్యం వంటివి 28 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి .
ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 28 రోజులు. గతంలో, ఎయిర్టెల్ యొక్క 799 రూపాయల ప్లాన్ లో రోజుకు 3 జిబి డేటాను అందిచేది . తాజా అప్డేట్ లతో, ఎయిర్టెల్ దాని ప్రీపెయిడ్ కస్టమర్లకు 28 రోజులపాటు 98 GB 3G / 4G డేటాను అందిస్తోంది. ఎయిర్టెల్ యొక్క 799 ప్యాక్లో 'అన్లిమిటెడ్' కాల్స్ రోజుకు 250 నిమిషాలు మరియు వారానికి 1,000 నిమిషాలు మాత్రమే పరిమితం . ఇది లోకల్ మరియు ఎస్టీడీ కాల్స్ కి వర్తిస్తుంది. దీనితో పాటు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కొత్త ఎయిర్టెల్ ప్యాక్ కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులకు 75 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.