టెలికాం రంగంలో జరుగుతున్న కఠినమైన పోటీలో ఎయిర్టెల్ దాని ప్రత్యేక ఆఫర్ తో ముందుకు వచ్చింది. ఇది కంపెనీ యొక్క దీర్ఘకాలికప్లాన్ , ఇందులో కంపెనీ 360 రోజులకు డేటాను అందించి కాల్స్ ఇస్తుంది . పదేపదే రీఛార్జింగ్ యొక్క అవాంతరాన్ని నివారించాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ను ఖచ్చితంగా ఇష్టపడతారు . ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్ కోసం, వినియోగదారులు 3,999 రూపాయలు రీఛార్జి చేయాలి. ఈ ఆఫర్లో, వినియోగదారులు 300 GB డేటాను పొందుతారు, వినియోగదారులు 360 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు .ఎయిర్టెల్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్ ని కూడా ఇస్తుంది.ఎయిర్టెల్ యొక్క ఈ ఆఫర్ రోజుకి 100 SMS లిమిట్ తో వస్తుంది. ఈప్లాన్ లో అవుట్గోయింగ్ నేషనల్ రోమింగ్ కూడా ఉచితం.
రూ .3,999 ప్లాన్ తో పాటు, ఎయిర్టెల్ కొన్ని ఇతర దీర్ఘకాలిక ప్లాన్లను కూడా అందిస్తోంది. ఇందులో 1,999 రూపాయలు, 999 రూపాయల ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్ ల వాలిడిటీ 90 రోజుల నుంచి 180 రోజుల వరకు ఉంటుంది.