భారతి ఎయిర్టెల్ మరోసారి 649 రూపాయల ప్లాన్ ను సవరించింది. ఈ ప్లాన్ లో, ముందుగానే వినియోగదారులకు మరింత ప్రయోజనాలు పొందుతున్నారు . కొంతకాలం క్రితం ఎయిర్టెల్ 649 రూపాయల ప్లాన్ ని తొలగించి, బదులుగా 399 రూపాయలు, 499 రూపాయలు, మరియు 799 రూపాయల పోస్టుపెయిడ్ ప్లాన్ లను ప్రవేశపెట్టింది .
ఇప్పుడు కంపెనీ మరోసారి 649 రూపాయల పోస్ట్ పెయిడ్ ప్లాన్ ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ పోస్ట్పెయిడ్ ప్లాన్లో, వినియోగదారులు 50 GB డేటా మరియు ఉచిత యాడ్-ఆన్ కనెక్షన్లు పొందుతారు.50 GB డేటాతో పాటుగా, ఈ ప్లాన్ లో వినియోగదారులు అపరిమితంగా వాయిస్ కాల్స్ పొందుతారు, ఇది లోకల్ STD మరియు రోమింగ్లలో కూడా చేయవచ్చు. దీనితో పాటు, ప్రతిరోజు 100 లోకల్ మరియు నేషనల్ SMS లు అందుతాయి. దీనితో పాటు, వినియోగదారులు ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ టీవీ మరియు ఎయిర్టెల్ సెక్యూర్ డివైస్ ప్రొటెక్షన్ ప్లాన్ లాంటి ప్రయోజనాలను పొందవచ్చు.
రీ లాంచ్ తరువాత, ఈ ప్లాన్ ని ఫ్రీ యాడ్ ఆన్ కనెక్షన్ లాభాలతో పాటు ఈ ప్లాన్ ను అందిస్తోంది. యాడ్-ఆన్ కనెక్షన్ స్కీం లో, వినియోగదారులు వారి ప్రైమ్ ప్లాన్ లలో చైల్డ్ ఎయిర్టెల్ పోస్ట్పేడ్ కనెక్షన్లను తీసుకోవచ్చు మరియు బదులుగా రూ .100 మాత్రమే చెల్లించవలిసి ఉంటుంది . యాడ్-ఆన్ కనెక్షన్ లో చేరిన వినియోగదారుడు 649 రూపాయల ప్లాన్ లో తాను పొందిన అన్ని ప్రయోజనాలను పొందగలుగుతాడు.
దీనికి ముందు కంపెనీ 799 రూపాయల యాడ్ ఆన్ కనెక్షన్ స్కీమ్ , మరియు దీనికంటే ఖరీదైన ప్లాన్ లను ప్రవేశపెట్టిందని తెలుసు . ఇప్పుడు 799 రూపాయల ప్లాన్ లో రెండు యాడ్ ఆన్ కనెక్షన్లు లభ్యం . అదే సమయంలో, మూడు యాడ్ ఆన్ కనెక్షన్లను ఇప్పుడు 1199 రూపాయల పోస్ట్పెయిడ్ ప్లాన్ లో చేర్చవచ్చు.