భారత్ లో టెలికామ్ వార్ తీవ్రంగా కొనసాగుతుంది.
ఇది కూడా మీకు నచ్చుతుంది. :బ్యాటరీ బ్యాక్ అప్ పెంచుకొనే కొన్ని టిప్స్
ఇప్పుడు అన్ని టెలికామ్ కంపెనీలన్నీ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించే దిశగా ఆలోచిస్తున్నాయి. దీనిలో భాగం గానే టెలికామ్ దిగ్గజం ఒక ఏడాది పూర్తిగా డేటా ను అందించే ఆఫర్ ప్రవేశపెడుతుంది. రిపోర్ట్స్ ప్రకారం ఎయిర్టెల్ తన యూజర్స్ కోసం 1000జీబీ డేటా అదనంగా ఫ్రీ గా ఇస్తుంది.ఎయిర్టెల్ ఈ ఆఫర్ ని పొందటానికి 4 ప్లాన్స్ ప్రవేశపెట్టింది ,1099 రూ , 1299 రూ , 1499 రూ మరియు 1799 రూ ఈ ప్లాన్స్ లో 1000జీబీ డేటా ఫ్రీ గా లభిస్తుంది. ఇవే కాక ఒక 899 రూ గల ఒక ప్లాన్ కూడా వుంది. దీనిలో యూజర్స్ కి 750డేటా ఒక ఏడాది పాటు లభిస్తుంది. 1099 రూ గల ప్లాన్ లో 40mbps స్పీడ్ మరియు 90జీబీ డేటా లభిస్తుంది.1,299 రూ గల ప్లాన్ లో 100 mbps స్పీడ్ తో 125జీబీ డేటా లభిస్తుంది. 1,499 రూ మరియు 1,799 రూ గల ప్లాన్ లో 100mbps స్పీడ్ మరియు 160జీబీ /220డేటా లభిస్తుంది.ఎయిర్టెల్ యొక్క ఈ సర్ప్రైజ్ ఆఫర్ కేవలం రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవకి కౌంటర్ ఇవ్వటానికే ప్రవేశపెట్టబడింది .దీనికోసం యూజర్ కి అదనపు చార్జీలు లేవు.