ఎయిర్టెల్ ఈ ప్లాన్ ను ప్రత్యేకంగా 3G సబ్స్క్రయిబర్స్ కు పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాన్ లో వినియోగదారులు రూ. 65 లో 1GB 3G లేదా 2G డేటాను పొందుతారు . ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 28 రోజులు. అయినప్పటికీ, ఈ ప్లాన్ ప్రస్తుతం ఎంపిక చేసుకున్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.
వినియోగదారులు ఈ ప్లాన్ లో 28 రోజులు 1GB డేటాను పొందుతున్నారు. ఈ ప్లాన్ రూ. 49 ప్లాన్ కంటే చాలా ఖరీదైనదిగా కనిపిస్తుంది, దీని వాలిడిటీ ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే. ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు 98రూపీస్ టారిఫ్ ప్లాన్ లో 2GB 4G / 3G డేటాను అందిస్తోంది. కొందరు ఎంపిక చేసుకున్న వినియోగదారులకు ఎయిర్టెల్ యొక్క రూ. 98 కొత్త ప్లాన్ లో 5GB డేటా అందుబాటులో ఉంది.
గతంలో, ఎయిర్టెల్ వినియోగదారులకు కొన్ని రూ. 49 లో 1GB 4G డేటా పొందడం జరిగింది, దీని వాలిడిటీ ఈ కొత్త ప్లాన్ నుండి భిన్నంగా ఉంది.జియో యొక్క సొంత టారిఫ్ ప్లాన్స్ ని పునఃపరిశీలించి, ఎయిర్టెల్ తన ప్లాన్స్ ని రివైజ్ చేసి అనేక ప్లాన్ లలో, రోజుకు 1GB డేటాకు బదులుగా 1.4GB డేటా అందిస్తుంది .