Unlimited కాల్స్ అండ్ ఇంటర్నెట్ తో myPlan infinity ఆఫర్స్ లాంచ్ చేసిన ఎయిర్టెల్

Updated on 21-Dec-2016

రిలయన్స్ Jio ఎఫెక్ట్ తో టెలికాం రంగంలో వేగంగా ఆఫర్స్ మార్పులు జరుగుతున్నాయి వరుసగా. Jio మార్చ్ 31 వరకూ పెంచేసరికి మిగిలిన నెట్వర్క్స్ ఆఫర్స్ ఇవ్వటానికి పూనుకున్నాయి.

ఎయిర్టెల్ రీసెంట్ గా unlimited కాల్స్ తో పాటు ఇంటర్నెట్ అందించే రెండు ఆఫర్స్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసినదే – స్టోరీ లింక్

ఇప్పుడు మరలా myPlan infinity ఆఫర్ ద్వారా రెండు  Postpaid కొత్త ప్లాన్స్ లను అందిస్తుంది. ఇవి కూడా unlimited కాల్స్ ఇస్తున్నాయి. లాస్ట్ వీక్ రిలీజ్ చేసిన ప్లాన్స్ కు వీటికి కేవలం incoming రోమింగ్ ఫ్రీ ఒకటే యాడ్ అయ్యింది.

549 రూ myPlan ఇన్ఫినిటీ ఆఫర్ – లోకల్ అండ్ STD unlimited కాల్స్, unlimited incoming on రోమింగ్, Wynk మ్యూజిక్ & మూవీస్ నెల వారి సబ్స్క్రిప్షన్ అండ్ రోజుకు 100 లోకల్ – STD మెసేజెస్. వీటితో పాటు అదనంగా 3GB 4G ఇంటర్నెట్ డేటా వస్తుంది. ఇవన్ని బిల్ సైకిల్ లోపల వాడేసుకోవాలి. 3G ఫోనులు వాడుతుంటే కేవలం 1GB వస్తుంది డేటా.

799 రూ myPlan ఇన్ఫినిటీ ఆఫర్ –  same 549 రూ ఆఫర్ లో ఉన్నవన్నీ ఉన్నాయి, కాని దీనిలో అదనంగా వచ్చే 4G ఇంటర్నెట్ డేటా 5GB ఉంటుంది. 4G స్మార్ట్ ఫోన్ లేని వారికి 3GB డేటా అందుతుంది.

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :