Airtel కొత్త టారిఫ్ ప్లాన్ లాంచ్ …

Updated on 05-Mar-2018

ప్రీపెయిడ్ వినియోగదారుల ముందు  ఎయిర్టెల్ రూ.  995 ప్లాన్ తో  వచ్చింది. ఈ ప్లాన్ 180 రోజుల వాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ ని ఒకసారి రీఛార్జి చేస్తే వినియోగదారులు 6 నెలలు డేటా, వాయిస్ కాల్ మరియు SMS లాభం పొందుతారు. 

వెబ్ సైట్లో లిస్టింగ్  ప్రకారం, రూ. 995 ప్లాన్  180 రోజుల వాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ లో , వినియోగదారులు నెలకు 1GB డేటాను పొందుతారు, అంటే 3G-4G స్పీడ్ తో మొత్తం 6 GB డేటా. అలాగే లోకల్ , ఎస్టీడీ సహా ప్లాన్ లో అపరిమిత వాయిస్ కాల్  పొందండి మరియు రోమింగ్ కాల్స్ 180 రోజులకు లభ్యం . ఈ ప్యాక్ లో  100 లోకల్ మరియు నషన్ల  SMS రోజువారీ లభ్యం . అలాగే, ఈ  వాలిడిటీ పీరియడ్ లో  ఎయిర్టెల్ TV యాప్ పై  ఫ్రీ సబ్స్క్రిప్షన్  అందుబాటులో ఉంటుంది.

ప్లాన్ బెనిఫిట్స్ చూడటం ద్వారా, వాయిస్ కాలింగ్ ని  ఇష్టపడే వినియోగదారుల కోసం కంపెనీ ఈ ప్లాన్ ను ప్రవేశపెట్టిందని మీరు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ప్లాన్ కేవలం 6 GB డేటాను అందిస్తుంది. కానీ మీరు ఈ ప్లాన్ లో   డేటా లబ్ది పొందాలనుకుంటే, కంపెనీ  దాని యాడ్ ఆన్ ప్లాన్ లను కూడా ప్రవేశపెట్టింది.

ఈ ప్లాన్ తో  వినియోగదారులు 193 రూపాయల యాడ్ ఆన్ ప్లాన్ ను కూడా  పొందవచ్చు, అందులో వినియోగదారులు 180 రోజులకు  ప్రతిరోజూ ఒక GB డేటాను పొందుతారు. ఎయిర్టెల్ యొక్క ఈ ప్లాన్ ప్రస్తుతం ఎంపిక సర్కిల్లో మాత్రమే అందుబాటులో ఉంది, ఇందులో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ, ఢిల్లీ NCR, కర్ణాటక ఉన్నాయి.

అయితే, లాంగ్ టైం తో డేటా ప్రయోజనాన్ని అందించే ప్లాన్  కోసం మీరు వెతుకుతుంటే, ఎయిర్టెల్ యొక్క  999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ని  ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్లాన్  90 రోజులు అంటే మూడు నెలల వాలిడిటీ తో వస్తుంది , దీనిలో వినియోగదారుడు 4G నెట్వర్క్ స్పీడ్ తో 60GB డేటాను పొందుతాడు. మిగిలిన ప్లాన్ల లాగే , ఈ ప్లాన్  అపరిమిత వాయిస్  కాల్స్ మరియు SMS లను అందిస్తుంది.

 

 

 

 

Connect On :